-
-
Home » Andhra Pradesh » Guntur » Homes should be limited
-
ఇళ్ళకే పరిమితమవ్వాలి
ABN , First Publish Date - 2020-03-25T09:29:32+05:30 IST
నగరంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా అనురాధ తెలిపారు.

రోడ్లన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి
గుంటూరు(కార్పొరేషన్), మార్చి 23: నగరంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా అనురాధ తెలిపారు. మంగళవారం ఆమె నగరంలోని బ్రాడీపేట, రాజీవ్‌గాంధీనగర్, కొరిటెపాడు, ముత్యాలరెడ్డినగర్, మల్లికార్జునపేట తదితర ప్రాంతాల్లో పర్యటించి పారిశుధ్య పనులను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ప్రజలు అత్యవసర పరిస్థితుల్లోనే తగిన ఆధారాలతోనే రోడ్డుపైకి రావాలన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారి గృహాలు, ప్రాంతాలపై నిఘా ఉంచామన్నారు. ఇళ్లల్లోని చెత్తాచెదారాలను కాల్వలు, రోడ్లపై వేయరాదని తెలిపారు. రోడ్లతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు. విదేశాల నుంచి ఎవరైనా వస్తే తక్షణమే సమాచారం అందించాలన్నారు.
నగరంలో మంగళవారం తూర్పు ఎమ్మెల్యే ఎండీ ముస్తఫా ఆధ్వర్యంలో వాటర్ ట్యాంక్‌లతో క్లోరిన్, బ్లీచింగ్ మిక్స్‌డ్ వాటర్ స్ర్పే చేశారు. ప్రధాన రహదారులను శుభ్రం చేశారు. నాజ్‌సెంటర్‌లో ఎమ్మెల్యే ముస్తఫా స్వయంగా స్ర్పే చేసి సిబ్బందికి సూచనలు, సలహాలు చేశారు.