హోంగార్డ్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా గోవిందు
ABN , First Publish Date - 2020-12-11T05:45:55+05:30 IST
హోంగార్డ్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎస్ గోవిందు ఎన్నికయ్యారు. చిలకలూరిపేటలోని మెడికల్ అసోసియేషన్ హాలులో గురువారం కార్యవర్గ ఎన్నిక జరిగింది.
చిలకలూరిపేట టౌన్, డిసెంబరు 10: హోంగార్డ్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎస్ గోవిందు ఎన్నికయ్యారు. చిలకలూరిపేటలోని మెడికల్ అసోసియేషన్ హాలులో గురువారం కార్యవర్గ ఎన్నిక జరిగింది. జనరల్ సెక్రటరీగా దస్తగిరిబాబు(తిరుపతి), సీనియర్ వైస్ ప్రెసిడెంట్లుగా జీ నరసింహారావు, మానం శ్రీనివాసరావు, వైస్ ప్రెసిడెంట్‌గా ఏవో ప్రసాద్, ట్రెజరర్‌గా కే నాగేశ్వరరావులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం జరిగిన సమావేశంలో హోంగార్డుల క్రమబద్ధీకరణ, ఉద్యోగభద్రత, కారుణ్య నియామకాలు, మూడు సెంట్ల స్థలం తదితర సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కార్యవర్గం తీర్మానం చేసింది. ఈ కార్యక్రమంలో గుంటూరు రూరల్ జిల్లా అధ్యక్షుడు షేక్ మొబిన్‌అహ్మద్, పీఆర్వో సీహెచ్ శ్రీనివాసరావు, ట్రెజరర్ మధు, ఈసీ మెంబర్ వై మల్లికార్జునరావు, మధు, మహరాజ్‌వలి తదితరులు పాల్గొన్నారు.