ఇళ్ల స్థలాల్లో అర్హులకు మొండిచేయి

ABN , First Publish Date - 2020-12-29T05:57:44+05:30 IST

మండల కేంద్రమైన కాకుమానులో స్థలాల పంపిణీ కార్యక్రమంలో ఉద్రిక్తత నెలకొంది. అర్హులైన నిరుపేదలకు ఇళ్లు ఇవ్వడంలో అధికార పార్టీ నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు మువ్వా భద్రయ్యచౌదరి హోంమంత్రి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.

ఇళ్ల స్థలాల్లో అర్హులకు మొండిచేయి
హోంమంత్రి వద్ద గోడు వెళ్లబోసుకుంటున్న మహిళను నెట్టివేస్తున్న పోలీసులు

 హోంమంత్రి ఎదుట ఆవేదన


 కాకుమాను, డిసెంబరు 28: మండల కేంద్రమైన కాకుమానులో స్థలాల పంపిణీ కార్యక్రమంలో ఉద్రిక్తత నెలకొంది. అర్హులైన నిరుపేదలకు ఇళ్లు ఇవ్వడంలో అధికార పార్టీ నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు మువ్వా భద్రయ్యచౌదరి హోంమంత్రి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ఆయన మెడపట్టుకుని బయటకు నెట్టే ప్రయత్నం చేశారు. ఆయనకు ఇళ్లస్థలాల జాబితాలో పేర్లు లేని వారు కూడా తోడయ్యారు. హోంమంత్రి కలగజేసుకోవడంతో అక్కడ ఉన్న మహిళలు కొద్దిగా శాంతించారు. హోంమంత్రితో  భద్రయ్యచౌదరి మాట్లాడుతూ తన వార్డులో అర్హత ఉండి , నివేశన స్థలాలు మంజూరు కాని వారికి ఏం సమాధానం చెప్పాలని ఆవేదన వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-12-29T05:57:44+05:30 IST