వైసీపీతోనే బీసీల సమగ్రాభివృద్ధి

ABN , First Publish Date - 2020-12-14T05:03:34+05:30 IST

బీసీల సమగ్రాభివృద్ధి వైసీపీ ప్రభుత్వంతోనే సాధ్యమని హోం మంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు.

వైసీపీతోనే బీసీల సమగ్రాభివృద్ధి
సమావేశంలో ప్రసంగిస్తోన్న హోం మంత్రి సుచరిత, వేదికపై ఎంపీ మోపిదేవి ఇతర నేతలు

హోం మంత్రి మేకతోటి సుచరిత

గుంటూరు, డిసెంబరు 13: బీసీల సమగ్రాభివృద్ధి  వైసీపీ ప్రభుత్వంతోనే సాధ్యమని హోం మంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. చాత్తాద శ్రీ వైష్ణవ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వరయూరి మధుసూదనరావు ఆధ్వర్యంలో ఆదివారం జీటీ రోడ్డులోని గుంటూరు కన్వెన్షన్‌ హాల్లో ఇటీవల పదవులు పొందిన చైర్మన్‌ తిరువాయిపాటి మనోజ్‌కుమార్‌, డైరక్టర్‌లు మధుసూదనరావు, అక్షయపాత్ర వేణుమాధవితో పాటు ఇతర డైరెక్టర్లకు సన్మానించారు. ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ పదవులు పొందిన వారు విజిటింగ్‌ కార్డులకే పరిమితం కాకుండా పదవులకు వన్నె తెచ్చేలా కృషి చేయాలన్నారు. ఎంపీ మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా 56 బీసీ కార్పొరేషన్‌లు ఏర్పాటు చేసి ఆయా సామాజికవర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. తెలుగు అకాడమీ చైౖర్మన్‌ లక్ష్మీపార్వతి మాట్లాడుతూ గతంలో బీసీలకు ఏ ప్రభుత్వం చేయని మేలు సీఎం జగన్‌ చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఎండీ ముస్తఫా, మద్దాళి గిరిధర్‌, ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్యవరప్రసాద్‌, జంగా కృష్ణమూర్తి, మార్కెట్‌యార్డు చైర్మన్‌ చంద్రగిరి ఏసురత్నం, వైసీపీ నగర అధ్యక్షుడు పాదర్తి రమేష్‌గాంధీ, చాత్తాద శ్రీ వైష్ణవ సంఘం తెలంగాణ అధ్యక్షుడు అశ్వాపురం వేణుమాధవ్‌ , సంఘం నాయకులు తిన్నలూరి పార్ధసారధి, బెల్లంకొండ వెంకటేశ్వర్లు, అక్షయపాత్ర శ్రీనివాసరవీంద్ర, టి.ఆంజనేయులు, ఎస్‌పీ రామ్‌పరమేష్‌ తదితరులున్నారు.  


Updated Date - 2020-12-14T05:03:34+05:30 IST