రుణాల చెల్లింపులను ఆరునెలల వాయిదా వేయాలి: మల్లెల

ABN , First Publish Date - 2020-03-27T09:17:15+05:30 IST

వసాయ ఉత్పత్తులను పూర్థిస్థాయిలో ఇంటికి చేర్చలేక, చేర్చిన సరుకును మార్కెట్‌లో అమ్మలేదని, రాయపూడి పీఏసీఎస్‌ అధ్యక్షుడు మల్లెల హరేంద్రనాధ్‌ చౌదరి తెలిపారు.

రుణాల చెల్లింపులను ఆరునెలల వాయిదా వేయాలి: మల్లెల

గుంటూరు, మార్చి 26(ఆంధ్రజ్యోతి): రైతులు వ్యవసాయ ఉత్పత్తులను పూర్థిస్థాయిలో ఇంటికి చేర్చలేక, చేర్చిన సరుకును మార్కెట్‌లో అమ్మలేదని, రాయపూడి పీఏసీఎస్‌ అధ్యక్షుడు మల్లెల హరేంద్రనాధ్‌ చౌదరి తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఆప్‌కాబ్‌, నాబార్డు, ఆర్‌బీఐకి లేఖలు రాశారు. కరోనా నేపథ్యంలో గుంటూరు మిర్చి యార్డును మూసివేశారని, రాష్ట్రంలో పొగాకు కొనుగోళ్లను నిలిపివేశారని తెలిపారు. వివిధ గ్రామాల్లో వలస కూలీలు తమ స్వగ్రామాలకు చేరుకోవడంతో మిరప కోత ఆగిపోయిందని ఆయన తెలిపారు. రైతులు సరుకు అమ్మి బ్యాంక్‌లు, సహకార సంఘాల్లో రుణాలు చెల్లించే పరిస్థితి లేదని ఆ లేఖలో స్పష్టం చేశారు. మార్చి నెలాఖరులోపు చెల్లించాల్సిన పంట రుణాలను ఆరు నెలలు వాయిదా వేయాలని ఆయన కోరారు.

Updated Date - 2020-03-27T09:17:15+05:30 IST