విగ్రహాల తొలగింపుపై ప్రజలు ఛీకొడుతున్నారు: జీవీ

ABN , First Publish Date - 2020-09-16T14:11:18+05:30 IST

ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ప్రమేయంతోనే ఎన్‌టీ ఆర్‌, పరిటాల విగ్రహాలను..

విగ్రహాల తొలగింపుపై ప్రజలు ఛీకొడుతున్నారు: జీవీ

వినుకొండ(గుంటూరు): ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ప్రమేయంతోనే ఎన్‌టీ ఆర్‌, పరిటాల విగ్రహాలను తొలగించడంపై ప్రజలు ఛీ కొడుతున్నారని  జీవీ ఆంజనేయులు తెలిపారు. టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ వినుకొండలో అధికార పార్టీ అండదండలతో విగ్రహాలను తొలగించిన విషయాన్ని పక్కదారి పట్టించడానికే తమపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వినుకొండలో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో బొల్లా పర్సంటేజీలు అడుగుతున్నారన్నారు. కార్యక్రమంలో గోనుగుంట్ల హనుమంతరావు, దాసరి కోటేశ్వరరావు, బాలగురవయ్య, ఎనుముల పరమయ్య, బచ్చు అంజిరెడ్డి, విశ్వనాథం తదితరులు ఉన్నారు. 




Updated Date - 2020-09-16T14:11:18+05:30 IST