-
-
Home » Andhra Pradesh » Guntur » gv anjaneyulu
-
ఉద్యమంతో దిగొచ్చిన జగన్ సర్కార్
ABN , First Publish Date - 2020-11-22T04:45:39+05:30 IST
టీడీపీ చేపట్టిన నా ఇల్లు.. నా సొంతం కార్యక్రమానికి ప్రజల నుంచి పెద్దఎత్తున స్పందన రావటంతో జగన్ సర్కార్ దిగొచ్చిందని టీడీపీ నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి జీవీ ఆంజనేయులు అన్నారు.

జీవీ ఆంజనేయులు
గుంటూరు, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): టీడీపీ చేపట్టిన నా ఇల్లు.. నా సొంతం కార్యక్రమానికి ప్రజల నుంచి పెద్దఎత్తున స్పందన రావటంతో జగన్ సర్కార్ దిగొచ్చిందని టీడీపీ నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి జీవీ ఆంజనేయులు అన్నారు. శనివారం ఆయన ఆన్‌లైన్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. 25లక్షల ఇళ్ల పట్టాల హామీ, టీడీపీ హయాంలో పూర్తి చేసుకొన్న టిడ్కో ఇళ్ల పంపిణీ విషయంలో టీడీపీ రాజీలేని పోరాటం చేసిందన్నారు. పేదలను మభ్యపెట్టి రాజకీయ లబ్ధి పొందాలనే ధ్యాస తప్ప వారికి నివాసయోగ్యమైన స్థలాలు ఇవ్వాలనే ఆలోచన వైసీపీ నేతలకు లేదన్నారు. పట్టాల పంపిణీ పేరుతో వైసీపీ నేతలు దాదాపు రూ.4వేల కోట్ల భారీ అవినీతికి పాల్పడ్డారని, అలానే వాటికి మెరకలు పేర మరో పెద్ద అవినీతి జరుగుతోందని తెలిపారు. వీటిపై ఉన్నతస్థాయి న్యాయ విచారణ జరపాల్సిన అవసరం ఉందని జీవీ ఆంజనేయులు అన్నారు.