బైక్‌ను ఢీకొన్న బస్సు...వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2020-12-28T14:17:30+05:30 IST

జిల్లాలోని సత్తెనపల్లి మండలం నలంద కాలేజీ వద్ద సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.

బైక్‌ను ఢీకొన్న బస్సు...వ్యక్తి మృతి

గుంటూరు: జిల్లాలోని సత్తెనపల్లి మండలం నలంద కాలేజీ వద్ద సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. బైక్‌ను ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడు తాడికొండ మండలానికి చెందిన నాగరాజు (25)గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2020-12-28T14:17:30+05:30 IST