పది పరీక్షలకు సమాయత్తం కావాలి: డీఈవో గంగా భవాని

ABN , First Publish Date - 2020-03-08T08:55:20+05:30 IST

దో తరగతి పరీక్షలకు ఎటువంటి అవాంతరాలు లేకుండా పక్కా ప్రణాళికలతో సమాయత్తం కావాలని డీఈవో గంగా భవాని చెప్పారు. శనివారం సాయంత్రం ఐతానగర్‌...

పది పరీక్షలకు సమాయత్తం కావాలి: డీఈవో గంగా భవాని

తెనాలి టౌన్‌, మార్చి 7: పదో తరగతి పరీక్షలకు ఎటువంటి అవాంతరాలు లేకుండా పక్కా ప్రణాళికలతో సమాయత్తం కావాలని డీఈవో గంగా భవాని చెప్పారు. శనివారం సాయంత్రం ఐతానగర్‌ ఎన్‌.ఎస్‌.ఎస్‌.ఎం ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షా కేంద్రాల డీ.వోలు, సీ.ఎస్‌లకు సమావేశాన్ని నిర్వహించారు. బాపట్ల, తెనాలి అధికారులకు ఈ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పరీక్షలు మార్చి 31 నుంచి జరుగుతున్నందున 30న ప్రతి కేంద్రంలో ఇన్విజిలేటర్లతో సమావేశాన్ని నిర్వ హించాలన్నారు. కాఫీయింగ్‌ జరగడానికి అవకాశాలు ఉండకూడదన్నారు. సీ సెంటర్లలో సీసీ కెమేరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.


ఆయా పరీక్షల రోజున సంబంధిత సబ్జెక్ట్‌ ఉపాధ్యాయులు ఉండరాదన్నారు. మారిన పరీక్షా విధానాన్ని విద్యార్థులకు ఈ 13 రోజుల్లో  అవగాహన చేయాలన్నారు. పరీక్షల తేదీలు మారినందున పిల్లల్లో ఉత్సాహం తగ్గకుండా చూడాలన్నారు. ఈసారి ఏసబ్జెక్ట్‌కు బిట్‌ పేపరుండదన్నారు. 24 పేజీలతో కూడిన జవాబు పత్రాల బుక్‌లెట్‌ మాత్రమే ఉంటుందని,అడిషనల్‌ షీట్స్‌ ఉండవని పేర్కొన్నారు.గతంలో మా దిరి ఇంటర్నల్‌ మార్కులు ఉండవన్నారు.కార్యక్రమంలో తెనాలి, బాపట్ల ఉప విద్యా శాఖాధి కారులు వి.శ్రీనివాస్‌, పి.వి.జె.రామారావు, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్‌ కమీషనర్‌ జి.మాణిక్యాలు, ఎం.ఇ.వో మేకల లక్ష్మీ నారాయణ, ఆవుల తిరుమలేష్‌,  తావూర్యా పాల్గొన్నారు.

Updated Date - 2020-03-08T08:55:20+05:30 IST