అమరావతి బైపాస్‌కు టెండర్లు ఖరారు
ABN , First Publish Date - 2020-03-08T08:46:35+05:30 IST
విజయవాడ బైపాస్‌రోడ్డుకు కేంద్రప్రభుత్వం టెం డర్లు ఖరారుచేసింది. ఆదాని,మెఘా సంస్థలకు పనులు అప్పగిస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. భారతమాల ప్రాజక్టు కింద చిన్న అవుటుపల్లి నుంచి గొల్ల పూడి మీదుగా...

- ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు చొరవ
- రూ.2.689 కోట్లతో ఆరు వరుసల బైపాస్
గుంటూరు, మార్చి 7: విజయవాడ బైపాస్‌రోడ్డుకు కేంద్రప్రభుత్వం టెం డర్లు ఖరారుచేసింది. ఆదాని,మెఘా సంస్థలకు పనులు అప్పగిస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. భారతమాల ప్రాజక్టు కింద చిన్న అవుటుపల్లి నుంచి గొల్ల పూడి మీదుగా చిన్న కాకాని వరకు రూ.2.689కోట్ల వ్యయంతో ఆరులైన్ ల రహదారి ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు. నూతనంగా ఏర్పాటుచే స్తున్న ఈ బైపాస్‌రోడ్డు అమరావతి నగరానికి మణిహారంగా మారను న్నదని, ఈ పనులను రెండు ప్యాకే జీలలో పూర్తిచెయ్యాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. కాగా రాజధాని ప్రాంతాన్ని హైదరాబాద్ ఇతర నగరాలకు కలుపుతూ రాపిడ్ రోడ్ కనెక్టివిటీ ఏర్పాటుచేసే అంశం విభజన చట్టంలో ఉందని,ఈ హామీ ని నెరవేర్చాలని డిసెంబరులో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవ రాయలు కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీని కోరారు.
నూతన బైపాస్‌మా ర్గంతో హైదరాబాద్, విశాఖపట్నం నుంచి విజయవాడ మీదుగా వెళ్ళే వాహనాల రద్దీ తగ్గుతుందని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు వినతిలో పేర్కొ న్నట్లు తెలిపారు. అలాగే విజయ వాడ నుంచి ఇబ్రహీంపట్నం, తిరు వూరు, భద్రాచలం మీదగా జగద ల్పూర్ రోడ్డు మార్గాన్ని నాలుగు వరుసల రహదారిగా విస్తరించాలని కేంద్ర మంత్రిని ఎంపీ కోరారు.