స్వచ్ఛ గుంటూరు సాధనకు కృషి

ABN , First Publish Date - 2020-12-29T06:20:30+05:30 IST

అధికారులు సిబ్బంది కార్యాలయాల్లోని పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని స్వచ్ఛ గుంటూరు సాధించేందుకు కృషి చేయాలని నగర కమిషనర్‌ చల్లా అనురాధ తెలియచేశారు.

స్వచ్ఛ గుంటూరు సాధనకు కృషి
అధికారుల నుంచి వివరాలు సేకరిస్తున్న కమిషనర్‌.

నగర కమిషనర్‌ చల్లా అనురాధ

గుంటూరు(కార్పొరేషన్‌), డిసెంబరు 28: అధికారులు సిబ్బంది కార్యాలయాల్లోని పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని స్వచ్ఛ గుంటూరు సాధించేందుకు కృషి చేయాలని నగర కమిషనర్‌ చల్లా అనురాధ తెలియచేశారు. నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయం, సర్కిల్‌ ఆఫీస్‌, శానిటరీ ఇన్స్పెక్టర్‌ ఆఫీస్‌, అర్బన్‌ హెల్త్‌ సెంటర్స్‌,  వార్డ్‌ సచివాలయాలు, ఏఈ ఆఫీస్‌లను సంబంధిత అధికారులు, సిబ్బంది సోమవారం శుభ్రం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు వ్యక్తిగత  పరిశుభ్రతో పాటు పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్‌ పి.నిరంజన్‌ రెడ్డి, డిప్యూటీ కమిషనర్లు డి.శ్రీనివాసరావు, బి.శ్రీనివాసరావు, టి.వెంకట కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. 

ఐఐఐటీ ప్రవేశ ఫలితాల్లో ప్రతిభ 


ఐఐఐటీ ప్రవేశ ఫలితాలలో కోన బాల ప్రభాకర మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారు. వారిని, ఉపాధ్యాయులను సోమవారం కమిషనర్‌ చల్లా అనురాధ ప్రత్యేకంగా అభినందించారు. హెచ్‌ఎం కె.మంజులాదేవి, ఉపాధ్యాయులు హైమారావు, జె.రమాదేవి, విజయానంద్‌, జీఎస్‌ మాధవి తదితరులు పాల్గొన్నారు.

పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి


కార్యాలయాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్‌ నిరంజన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నగర పాలకసంస్థ ప్రధాన కార్యాలయంలోని సిటిజన్‌ చార్టర్‌, క్యాష్‌ కౌంటర్‌, బర్త్‌ అండ్‌ డెత్‌ విభాగం, రెవెన్యూ, టౌన్‌ ప్లానింగ్‌, ఎలక్షన్‌ సెల్‌, కంప్యూటర్‌ విభాగం, ప్రజారోగ్య విభాగం, సి సెక్షన్‌ను  సోమవారం ఆయన తనిఖీ చేశారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ అఽధికారులు, సిబ్బంది అందరు నిర్దేశిత సమయానికి విధులకు హాజరుకావాలన్నారు. అదనపు కమిషనర్‌ డిప్యూటీ కమిషనర్‌ డి .శీనివాసరావు, విభాగాల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-29T06:20:30+05:30 IST