గుంటూరులో జనసేన నిరసన

ABN , First Publish Date - 2020-12-28T18:12:14+05:30 IST

నివార్ తుఫాన్‌తో నష్టపోయిన రైతులకు తక్షణ పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ జనసేన నిరసన కార్యక్రమం చేపట్టింది.

గుంటూరులో జనసేన నిరసన

గుంటూరు: నివార్ తుఫాన్‌తో నష్టపోయిన రైతులకు తక్షణ పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ జనసేన నిరసన కార్యక్రమం చేపట్టింది. లాడ్జి సెంటర్ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. జనసేన పీఏసీ సభ్యులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, జిల్లా నాయకులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు నేతలు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ... జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్  పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా వినతిపత్రాలను అందజేసే కార్యక్రమం చేపట్టామన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు తక్షణ పరిహారం పదివేల రూపాయలు, పూర్తి పరిహారం ముప్పై ఐదు వేల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పరిహారం చెల్లించకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు.

Updated Date - 2020-12-28T18:12:14+05:30 IST