యువకుడి మృతదేహంతో అరండల్ పీఎస్‌ ఎదుట ఆందోళన

ABN , First Publish Date - 2020-12-21T01:32:12+05:30 IST

అరండల్ పోలీస్ స్టేషన్ ఎదుట యువకుడి మృతదేహంతో కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఆత్మహత్య చేసుకున్న కొరిటెపాడుకు

యువకుడి మృతదేహంతో అరండల్ పీఎస్‌ ఎదుట ఆందోళన

గుంటూరు: అరండల్ పోలీస్ స్టేషన్ ఎదుట యువకుడి మృతదేహంతో కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఆత్మహత్య చేసుకున్న కొరిటెపాడుకు చెందిన షేక్ పర్దీన్ వలీ(22) మృతదేహంతో బంధువులు ఆందోళన నిర్వహించారు. ప్రేమించిన అమ్మాయి తరపువారి వేధింపుల వల్లే పర్దీన్ వలీ ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సీఐ హామీతో ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

Updated Date - 2020-12-21T01:32:12+05:30 IST