బయట తిరిగితే కేసులు

ABN , First Publish Date - 2020-03-19T07:56:17+05:30 IST

కరోనా ప్రభావిత దేశాల నుంచి వచ్చిన వ్యక్తులు వైద్య ఆరోగ్య శాఖ అదికారుల సూచనల మేరకు 14 రోజుల పాటు గృహంలో ఐసోలేషన్‌ గదిలోనే ఉండాలని కలెక్టర్‌

బయట తిరిగితే కేసులు

గుంటూరు(మెడికల్‌), మార్చి 18: కరోనా ప్రభావిత దేశాల నుంచి వచ్చిన వ్యక్తులు వైద్య ఆరోగ్య శాఖ అదికారుల సూచనల మేరకు 14 రోజుల పాటు గృహంలో ఐసోలేషన్‌ గదిలోనే ఉండాలని కలెక్టర్‌, కోవిడ్‌-19 జిల్లా నోడల్‌ అధికారి శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ ఆదేశించారు. బుధవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో కరోనా నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌ను ఆయన సందర్శించారు. ‘మా ఇష్టం బయట తిరుగుతాం’ అనే శీర్షికన బుధవారం ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికలో, జిల్లా ఎడిషన్‌లో ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. కంట్రోల్‌ రూమ్‌కు జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న సమాచారం వివరాలను డీఎంహెచ్‌వో డాక్టర్‌ యాస్మిన్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సమీక్షలో కలెక్టర్‌ మాట్లాడుతూ అధికారుల సూచనలు ఉల్లంఘించి బయట సంచరించే వారిపై ప్రజారోగ్య భద్రత దృష్ట్యా ఐపీసీ సెక్షన్‌ 188 ప్రకారం పోలీసు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. దీని వల్ల వారి పాస్‌పోర్టులు, వీసాలకు ఇబ్బందులు ఏర్పడి భవిష్యత్తులో వారు విదేశాలకు వెళ్లే అవకాశం కోల్పోతారన్నారు. జిల్లాకు 891 మంది విదేశాల నుంచి వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం సమాచారం ఇచ్చిందన్నారు. విదేశాల నుంచి వచ్చిన వీరిని గ్రామ, వార్డు వలంటీర్లు, ఆశా వర్కర్ల ద్వారా గుర్తించి ఏఎన్‌ఎం, వైద్యాధికారుల పర్యవేక్షణలో వారి ఇళ్లల్లోనే ఇతరులతో కలవకుండా 14 రోజులు హోం ఐసోలేషన్‌లో ఉండాలన్నారు.  ఆరోగ్య సిబ్బంది ద్వారా నిత్యం వారి ఆరోగ్యం పరిశీలిస్తున్నట్లు తెలిపారు.  జిల్లాలో ఇప్పటి వరకు కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న ముందస్తు చర్యలకు ప్రజలు కూడా సహకరించాలని  కోరారు. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులకు కరోనా వైరస్‌ సోకిన అనుమానిత లక్షణాలైన గొంతు నొప్పి, జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యాధికారులకు సంప్రదించాలన్నారు.  


రిజిస్టర్‌ మ్యారేజ్‌లు చేసుకోండి...

వివాహాలు నిశ్చయమైన పెండ్లి చేసుకునేందుకు ఇప్పటికే విదే శాల నుంచి వచ్చిన వారు పూర్తి జాగ్రత్తలు తీసుకుని వారి వివాహా లు రిజిస్ట్రార్‌ సమక్షంలో ఇంటిలో లేదా రిజిస్టర్‌ కార్యాలయంలో చేసుకోవాలని కలెక్టర్‌ తెలిపారు. కొద్ది మంది బంధువులను మాత్ర మే ఈ వేడుకలకు ఆహ్వానించాలని తెలిపారు. విదేశాల నుంచి వ చ్చిన 14 రోజుల తర్వాత కోవిడ్‌-19 లక్షణాలు లేని వారు మాత్రమే ఈ వివాహాలు చేసుకోవాలని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆడం బరాలకు పోకుండా సాధ్యమైనంత వరకు అతి తక్కువ మంది బం ధువులతో రిజిస్ట్రార్‌ సమక్షంలో వివాహాలు చేసుకోవాలన్నారు.  కార్య క్రమంలో ట్రైనీ కలెక్టర్‌ మౌర్య నారపురెడ్డి, రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌నీరద, డీఎంహెచ్‌వో యాస్మిన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-03-19T07:56:17+05:30 IST