గుంటూరు: అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-12-28T13:49:01+05:30 IST

జిల్లాలోని వేమూరు మండలం జంపనిలో అప్పుల బాధ తాళలేక కౌలు రైతు మైల శ్రీనివాసరావు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నా

గుంటూరు: అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య

గుంటూరు: జిల్లాలోని వేమూరు మండలం జంపనిలో అప్పుల బాధ తాళలేక కౌలు రైతు మైల శ్రీనివాసరావు  పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.  శ్రీనివాసరావు జంపనిలో నాలుగు ఎకరాల నిమ్మతోట, మూడు ఎకరాల వరి కౌలు సాగు చేపట్టాడు. అయితే పంట నష్టం రావడంతో, అప్పుల బాధ ఎక్కువై పురుగుల మందు తాగి బలవన్మరణానికి యత్నించాడు. వెంటనే గుర్తించిన కుటుంబసభ్యులు శ్రీనివాసరావును ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Read more