గుంటూరులో వాజపేయి జయంతి వేడుకలు

ABN , First Publish Date - 2020-12-25T18:01:15+05:30 IST

జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని వాజపేయి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

గుంటూరులో వాజపేయి జయంతి వేడుకలు

గుంటూరు: జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని వాజపేయి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వాజపేయి చిత్రపటానికి బీజేపీ నేత కన్నా లక్ష్మీ నారాయణ, గుంటూరు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు రామకృష్ణ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కన్నా లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ... వాజపేయి జన సంఘ్ మొదటి అధ్యక్షుడుగా పని చేశారన్నారు. స్వర్ణ చతుర్భుజిని ప్రారంభించారని.. పోఖ్రాన్ అణు పరీక్షలు నిర్వహించారని తెలిపారు. కార్గిల్ యుద్ధ సమయంలో దేశ సత్తా చాటారన్నారు. ఉత్తమ పార్లమెంటేరియన్‌గా వాజపేయి నిలిచారని కన్నా లక్ష్మీనారాయణ కొనియాడారు. 

Updated Date - 2020-12-25T18:01:15+05:30 IST