అంబటి ప్రధాన అనుచరుడి బర్త్‌డే వేడుకల్లో అశ్లీల నృత్యాలు

ABN , First Publish Date - 2020-12-10T16:16:52+05:30 IST

సత్తెనపల్లిలో ఎమ్మెల్యే అంబటి ప్రధాన అనుచరుడి పుట్టినరోజు వేడుకల్లో అశ్లీల నృత్యాలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.

అంబటి ప్రధాన అనుచరుడి బర్త్‌డే వేడుకల్లో అశ్లీల నృత్యాలు

గుంటూరు: సత్తెనపల్లిలో ఎమ్మెల్యే అంబటి ప్రధాన అనుచరుడి పుట్టినరోజు వేడుకల్లో అశ్లీల నృత్యాలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.  వైఎస్సార్ పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు,  అంబటి అనుచరుడు అచ్యుత శివప్రసాద్ బర్త్ డే వేడుకల్ని వావిలాల స్మృతి వనంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రికార్డింగ్ డాన్స్‌లు పెట్టడంతో పలువురు కౌన్సిలర్ అభ్యర్థులు మద్యం తాగి డ్యాన్సర్లతో అశ్లీల నృత్యాలు వేశారు. స్వాతంత్ర్య సమరయోధుడు వావిలాలకు ఇది ఘోరమైన అవమానం అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ నాయకులు తీరును జనసేన, వామపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించారు. 

Updated Date - 2020-12-10T16:16:52+05:30 IST