జీజీహెచ్‌కి ఏలూరు బాఽధితులు
ABN , First Publish Date - 2020-12-07T05:04:04+05:30 IST
ఏలూరులో మూర్ఛలకు గురై ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్న ఐదుగురిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి ఆదివారం సాయంత్రం తీసుకువచ్చారు.

గుంటూరు (సంగడిగుంట), డిసెంబరు6: ఏలూరులో మూర్ఛలకు గురై ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్న ఐదుగురిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి ఆదివారం సాయంత్రం తీసుకువచ్చారు. పడవల చలపతిరావు, చెంబు లింగాచారి, కుసుమకుమారి, రమణమ్మ, లక్ష్మీకుమారికి చికిత్సను అందిస్తున్నారు. ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. మూర్ఛతో పాటు కొందరిలో స్వల్ప పక్షవాత లక్షణాలు కూడా గుర్తించారు. వీరందరికీ అవసరమైన అన్ని వైద్యపరీక్షలు నిర్వహించారు. సోమవారం ఉదయం మెడికల్ కళాశాల నుంచి ప్రత్యేక బృందం దీనిపై అధ్యయనం చేసేందుకు ఏలూరు వెళుతోంది.