పల్నాడు కోసం పోరు ఉధృతం

ABN , First Publish Date - 2020-11-15T18:44:56+05:30 IST

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు పలు చోట్ల వివాదాలకు తెరతీస్తోంది.

పల్నాడు కోసం పోరు ఉధృతం

గుంటూరు: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు పలు చోట్ల వివాదాలకు తెరతీస్తోంది. నరసరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లా ఏర్పాటుపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో పల్నాడు జిల్లా ఏర్పాటు విషయంలో పోరు ఉధృతమవుతోంది. గురజాలలో మాజీ ఎమ్మెల్యే యరపతినేని ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ప్రారంభమైంది. అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు సమావేశంలో పాల్గొన్నారు.  గురజాల కేంద్రంగానే పల్నాడు జిల్లా ఏర్పాటు చేయాలని సమావేశం డిమాండ్ చేస్తోంది. కాగా నరసరావుపేట కేంద్రం ఏర్పాటుకు అధికార యంత్రాంగం పరిశీలన చేస్తున్న నేపథ్యంలో... ప్రత్యక్ష పోరాటాలకు సిద్దమవ్వాలని నిర్ణయించారు. 

Updated Date - 2020-11-15T18:44:56+05:30 IST