గురజాల ఏఎస్ఐపై ఎస్పీకి ఫిర్యాదు

ABN , First Publish Date - 2020-10-07T16:56:12+05:30 IST

గురజాల ఏఎస్‌ఐ వెంకట్రావు నుండి ప్రాణహాని ఉందంటూ బాధితులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

గురజాల ఏఎస్ఐపై ఎస్పీకి ఫిర్యాదు

గుంటూరు: గురజాల ఏఎస్‌ఐ వెంకట్రావు నుండి ప్రాణహాని ఉందంటూ బాధితులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దాచేపల్లికి చెందిన రాములమ్మ అనే మహిళతో ఏఎస్ఐ  వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాములమ్మ ఇటీవలే మృతి చెందటంతో ఆమె ఆస్తులపై ఏఎస్‌ఐ కన్నేశాడు.  రాములమ్మ కుమారులను స్థానిక పోలీసు అధికారుల వద్దకు పిలిపించి బెదిరింపులకు పాల్పడ్డాడు. రాములమ్మ భర్త శివయ్య గతంలో కనిపించకుండా పోయాడు. అయితే ఏఎస్‌ఐ వెంకట్రావే శివయ్యకు హాని కలిగించాడని రాములమ్మ కుమారులు ఆరోపించారు. తమ తండ్రి మిస్సింగ్‌పై విచారణ చేయించాలని విజ్ఞప్తి చేశారు. ఏఎస్‌ఐ వెంకట్రావు నుండి ప్రాణ రక్షణ కల్పించమని జిల్లా ఎస్పీకి రాములమ్మ కుమారులు ఫిర్యాదు చేశారు. 

Read more