గుంటూరులో అద్దంకి-నార్కెటపల్లి హైవేపై సమీక్ష

ABN , First Publish Date - 2020-10-03T20:09:46+05:30 IST

అద్దంకి - నార్కెటపల్లి హైవేపై జిల్లా కలెక్టరేట్‌లో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

గుంటూరులో అద్దంకి-నార్కెటపల్లి హైవేపై సమీక్ష

గుంటూరు: అద్దంకి - నార్కెటపల్లి హైవేపై జిల్లా కలెక్టరేట్‌లో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పాల్గొన్న ఎంపీ అయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సమీక్షాలో పాల్గొన్నారు. పిడుగురాళ్ల బైపాస్ అభివృద్ధి, దాచేపల్లి ముంపుపై ప్రధానంగా చర్చించనున్నారు. వెనకబడిన పల్నాడు అభివృద్ధి చెందాలని వైఎస్ఆర్ అద్దంకి -  నార్కెట్ పల్లి బైపాస్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారని మహేష్‌రెడ్డి తెలిపారు. అద్దంకి - నార్కెట్‌పల్లి హైవే కి దాచేపల్లి, పిడుగురాళ్లలు గుండెకాయలా మారాయన్నారు. పిడుగురాళ్ల రాళ్ళ బైపాసు ఈ హైవేకి అడ్డంకి మారిందని.. గత 7 ఏళ్ళుగా పిడుగురాళ్ల బైపాస్ పూర్తి కాకపోవడం దురదృష్టకరమని తెలిపారు. పిడుగురాళ్ల బైపాస్ పూర్తి చేసేందుకు సమీక్ష చేశామని చెప్పారు. 2021 దసరాకు బైపాస్ పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నామన్నారు. వర్షం వచ్చిన ప్రతిసారి దాచేపల్లి నీట మునుగుతుందని.. దాచేపల్లి కాట్రవాగుపై ఉన్న బ్రిడ్జి అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.  ముంపుకు గురైయ్యే  చేపల కాలనీ వాసులకు వేరే చోట శాశ్వత ఇళ్ల నిర్మాణం చేపడతామని ఎమ్మెల్యే మహేష్‌రెడ్డి పేర్కొన్నారు. 

Updated Date - 2020-10-03T20:09:46+05:30 IST