కోటప్పకొండలో అక్రమ తవ్వకాలు

ABN , First Publish Date - 2020-12-16T05:16:03+05:30 IST

జిల్లా కేంద్రం వస్తుందన్న పేరుతో నరసరావుపేటలో రియల్‌ బూమ్‌ నెలకొంది. దీంతో మాగాణి భూముల్లో రియల్‌ వెంచర్లు వెలిశాయి.

కోటప్పకొండలో అక్రమ తవ్వకాలు
కోటప్పకొండ వద్ద అక్రమ మట్టి తవ్వకాలు

అధికార పార్టీ పన్ను లారీకి రూ.1500

రూ.కోట్లలో ప్రభుత్వ ఆదాయానికి గండి

చోద్యం చూస్తున్న మైనింగ్‌ శాఖ అధికారులు

రోజుకు 400కు పైగా లారీల ద్వారా మట్టి తరలింపు


కోటప్పకొండలో కొండలు కరిగిపోతున్నాయి. కొండ ప్రాంతంలో గ్రావెల్‌కు గిరాకీ ఉంది.  దీంతో కోటప్ప కొండ కేంద్రంగా అక్రమ మట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. కొన్ని నెలలుగా అక్రమ మైనింగ్‌ను అధికార పార్టీ నేతలు నిరా టంకంగా సాగిస్తున్నారు. అక్రమార్కులు రోజుకు 400 నుంచి 500 వరకు లారీల్లో  మట్టిని తరలించుకుపో తున్నారు. రాత్రి పగలు అన్న తేడా లేకుండా కొండ ప్రాంతంలో మట్టిని తవ్వే స్తున్నారు. గ్రావెల్‌ విక్ర యాలు అక్రమార్కులకు కాసుల వర్షం కురి పిస్తున్నది. నెలకు రూ.3 కోట్లకు పైగా ఆదాయాన్ని అక్రమార్కులు ఆర్జిస్తున్నట్టు సమా చారం. అధికార పార్టీ నేతలు లారీకి రూ.1500 వసూలు చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. 


నరసరావుపేట, డిసెంబరు 15: జిల్లా కేంద్రం వస్తుందన్న పేరుతో నరసరావుపేటలో రియల్‌ బూమ్‌ నెలకొంది. దీంతో మాగాణి భూముల్లో రియల్‌ వెంచర్లు వెలిశాయి. ఇవి పల్లంలో ఉండటంతో వాటిని మెరక చేసేందుకు గ్రావెల్‌ అవసరమైంది. దీంతో అక్రమార్కుల కన్ను కోటప్పకొండలపై పడింది. దీంతో ఇక్కడి నుంచి పెద్దఎత్తున మట్టిని తరలించి సొమ్ము చేసు కుంటున్నారు. ఇక్కడ నుంచి నరసరావుపేటకు గ్రావెల్‌ సరఫరా కు లారీకి రూ.5 వేలు వసూలు చేస్తున్నారు. నరసరావుపేట రియల్‌ వెంచర్లకే రోజుకు వందల సంఖ్యలో కోటప్పకొండ నుంచి మట్టి తరలిస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండానే ఇక్క డ తవ్వకాలు జరుపుతున్నారు.


రోజుకు రూ.4.80 లక్షల ఆదాయం గండి

అక్రమ తవ్వకాలతో ప్రభుత్వ ఆదాయానికి రూ.కోట్లలో గండి పడుతున్నది. ప్రభుత్వ అనుమతి ఉంటే మైనింగ్‌ శాఖకు క్యూబిక్‌ మీటర్‌ గ్రావెల్‌కు రూ.60 చెల్లించాలి. లారీకి రూ.1200 చెల్లిం చాలి. అక్రమ మైనింగ్‌ వల్ల రోజుకు 400 లారీల చొప్పున లెక్కిస్తే సుమారు 4.80 లక్షల ప్రభుత్వ ఆదాయానికి గండి పడు తున్నది. ప్రభుత్వ పన్ను విధానం అమలు కాకపోయినా లారీకి ప్రైవేట్‌ పన్ను రూ.1500 వసూలు చేస్తున్నా రనేది బహిరంగ రహ స్యమే. 

మట్టి తవ్వకాలు మూడు ప్రాంతాల్లో జరుగుతున్నాయి. ఈ ప్రాంతాల్లో 24 గంటలూ కొందరు వ్వక్తులు ఉండి లారీ ల నుంచి నగదు వసూలు చేస్తున్నా రు. వైసీపీ మండల స్థాయి నేత ఒకరు ఈ పన్ను వసూళ్ల లెక్కలు చూస్తున్న ట్టు ప్రచారం జరుగు తున్నది. పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతుంటే మైనింగ్‌, విజిలెన్స్‌ శాఖ అధికారులు అటు వైపు కన్నెత్తి చూసే పరిస్థితి లేదని సమాచారం. వీరిపై అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు అధికంగా ఉండటంతో చర్యలు తీసుకునే సాహ సం సదరు అధికారులు చేయడంలేదు.


మట్టి సామ్రాజ్యం..

అధికార పార్టీలో ఆ నేతలు  తప్ప ఆ పార్టీ అయినా సరే ఇతర వ్యక్తులు మట్టిని విక్రయించే పరిస్థితి లేదు. ఒక వర్గానికే అక్రమ గ్రావెల్‌ వ్యాపారం పరిమితమైందన్న విమర్శలు అధికార పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నది. అధికార పార్టీలో మట్టి సామ్రాజ్యాన్ని కొందరు మాత్రమే శాసిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఇటీవల వైసీపీ నేత ఒకరు మట్టిని విక్రయించారు. ఇతడికి చెందిన లారీలు పట్టణంలోకి వచ్చే లోపే అధికారులు వాటిని రూరల్‌ పోలీసు స్టేషన్‌కు తరలించి ఆ నేతకు షాక్‌ ఇచ్చారు.


అనుమతులు లేవు

కోటప్పకొండ ప్రాంతంలో గ్రావెల్‌ తవ్వకాలకు ఎటు వంటి అనుమతులు ఇవ్వ లేదని మైనింగ్‌ శాఖ ఏడీ విష్ణు మంగళవారం తెలిపారు. మూడు చోట్ల జరుగుతున్న మట్టి తవ్వకాలపై చర్యలు తీసు కోనున్నట్టు చెప్పారు.

Updated Date - 2020-12-16T05:16:03+05:30 IST