మస్తాన్‌వలికి పలువురు నేతల పరామర్శ

ABN , First Publish Date - 2020-11-07T07:25:11+05:30 IST

ఇటీవల తెలంగాణలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కుమారుడు మృతితో విషాదంలో ఉన్న ఏపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ మస్తాన్‌వలిని పలువురు నేతలు శుక్రవారం పరామర్శించారు.

మస్తాన్‌వలికి పలువురు నేతల పరామర్శ

గుంటూరు, నవంబరు 6: ఇటీవల తెలంగాణలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కుమారుడు మృతితో విషాదంలో ఉన్న ఏపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ మస్తాన్‌వలిని పలువురు నేతలు శుక్రవారం పరామర్శించారు. ఏపీసీసీ అధ్యక్షుడు డాక్టర్‌ సాకే శైలజానాథ్‌, మాజీ ఎంపీ హర్షకుమార్‌, ఏఐసీసీ నేత కొప్పులరాజు, పంచాయితీరాజ్‌ సంఘటన్‌ రాష్ట్ర కో ఆర్డినేటర్‌ గంటా కిరణ్‌ పలువురు నాయకులు పొన్నూరు రోడ్డులోనున్న నివాసానికి వెళ్ళి మస్తాన్‌వలిని పరామర్శించారు.   కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. 

Updated Date - 2020-11-07T07:25:11+05:30 IST