భయం భయంగా.. బడికి..

ABN , First Publish Date - 2020-11-03T10:58:15+05:30 IST

కొవిడ్‌ భయం వెంటాడుతున్నా జిల్లాలో ఉన్నత..

భయం భయంగా.. బడికి..

కొవిడ్‌ జాగ్రత్తలతో ప్రారంభం

 222 రోజుల తర్వాత తెరుచుకున్నాయ్‌ 

 తొలి రోజు 65 శాతం మాత్రమే హాజరు

 పలు పాఠశాలల్లో మధ్యాహ్న 

  భోజనం చేయని విద్యార్థులు


 రోజుల అనంతరం జిల్లాలో బడి గం టలు మోగాయి. అయినా బడిని.. కరోనా భయం వెంటాడింది. కొవిడ్‌ తీవ్రత తగ్గుతోన్నా.. పిల్లల్ని పాఠశాలలకు పంపేందు కు తల్లిదండ్రులు సగం మందే ఆసక్తి చూపారు. పాఠ శాలల పునః ప్రారంభంపై ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో కొవిడ్‌ జాగ్రత్తల మధ్య విద్యార్థులు తరగతి గదుల్లోకి అడుగు పెట్టారు. అయితే హాజరైన వారిలో బాలికల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఆరు అడుగుల దూరం ఉండేలా బెంచీలు ఏర్పాటు చేసి తర గతులు నిర్వహించారు. విరామ సమయంలో విద్యార్థులతో యోగా, వ్యాయామాలు చేయిం చారు. జిల్లాలో తొమ్మిది, పది చదివే విద్యార్థు లు దాదాపు 95 వేల మంది ఉండగా వారిలో తొలిరోజు 65 శాతం మంది మాత్రమే తరగ తులకు హాజరయ్యారు. విద్యాశాఖ మంత్రి సురేష్‌  ఆదివారం మంగళగిరి మండలం చిన కాకానిలోని జడ్పీ స్కూల్‌లో తనిఖీ చేశారు.    


(ఆంధ్రజ్యోతి - న్యూస్‌నెట్‌వర్క్‌): కొవిడ్‌ భయం వెంటాడుతున్నా జిల్లాలో ఉన్నత పాఠశాలలు సోమవారం నుంచి పునః ప్రారంభం అయ్యాయి. తొలిరోజు జిల్లా వ్యాప్తంగా ఉన్నత  400పైగా ఉన్న ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేటు ఉన్నత  పాఠశాలల్లో విద్యార్థుల హాజరు 65 శాతంగా నమోదైంది. ఉదయం తొమ్మిది గంటలకే గేటువద్ద విద్యార్థులకు ధర్మల్‌ స్ర్కీనింగ్‌ చేసి, అనంతరం చేతుల్ని శానిటైజర్‌తో శుభ్రం చేసుకున్న తరువాత మాస్క్‌ ధరించిన విద్యార్థులను మాత్రమే లోపలికి అనుతించారు. ప్రతి తరగతి గదిలో 16 మంది విద్యార్థులకు అవకాశం కల్పించారు. 


 గుంటూరు నగరంలోని పది మున్సిపల్‌, మూడు ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలలు ప్రారంభం అయ్యాయి. పట్టాభిపురంలోని మున్సిపల్‌ స్కూల్‌లో ఒకవైపు కొవిడ్‌ టెస్టులు కోసం వచ్చిన వారు ఉండగా మరోవైపు తరగతులు ప్రారంభించారు. దీంతో విద్యార్థులు, వారి  తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.


మాచర్ల నియోజకవర్గ పరిధిలో విద్యార్థులు అరకొరగానే పాఠశాలలకు హాజరయ్యారు. మాచర్ల పట్టణంలో ప్రైవేటు పాఠశాలలు తెరవలేదు. దుర్గి మండలంలో 45 శాతం, రెం టచింతల మండలంలో 40 శాతంకు మించి విద్యార్థులు హాజరు కాలేదు. విజయపురిసౌత్‌లో 9వ తరగతి విద్యార్థులు 16 శాతం, 10 తరగతి 21 శాతం మంది విద్యార్థులు పాఠశాలకు వచ్చారు. 


 నరసరావుపేటలోని మునిసిపల్‌ ఉన్నత పాఠశాలలు తెరవ డగా, ప్రైవేటు పాఠశాలు పనిచేయలేదు. విద్యార్ధులు 50 శాతం హాజరైనట్టు మునిసిపల్‌ కమిషనర్‌ రామచంద్రారెడ్డి తెలిపారు. రొంపిచర్ల మండలంలోని ఉన్నత పాఠశాలల్లో తొలి రోజు 50 శాతం కంటే తక్కువ మంది విద్యార్థులు  హాజరయ్యారు. 


నిడుబ్రోలు జడ్పీ హైస్కూల్‌లో 9వ తరగతిలో 326 మందికి 94 మంది మాత్ర మే హాజరయ్యారు. పదో తరగతిలో 317 మం దికి 154 మంది  వచ్చారు.  వారిలో  మధ్యాహ్న భోజనం చే యటానికి 40 మంది విద్యార్థులు మాత్రమే సుముఖత వ్యక్తం చేశారని హెచ్‌ఎం వై వెంకటేశ్వరరావు తెలిపారు.  


 సత్తెనపల్లి, రాజుపాలెం, నకరికల్లు, ముప్పాళ్ళ మండలాల్లోని పాఠశాలల్లో విద్యార్థుల హాజరు 50 శాతం వరకు ఉంది.


 తెనాలి నియోజకవర్గంలో ఎక్కువ పాఠశాలల్లో సోమవారం పదో తరగతి విద్యార్థులకు మాత్రమే తరగతులు నిర్వహించారు. మంగళవారం 9వ తరగతి విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నట్లు ఉపాధ్యాయులు తెలిపారు. ఒక్క పూట తరగతులే నిర్వహించడంతో మధ్యాహ్న భోజనానికి విద్యార్థులు ఆసక్తి చూపలేదు.


 కొల్లూరు బాలికోన్నత పాఠశాలలో పదో తరగతిలో 78 మందికి 29 మంది, 9వ తరగతిలో 101 మందికి 35 మంది హాజరు కాగా పది మంది మాత్రమే మధ్యాహ్న భోజనం చేశారు. బాలురోన్నత పాఠశాల లో పదో తరగతిలో 73 మందికి 25 మంది, 9వ తరగతిలో 94 మందికి 17 మంది హాజరు కాగా, 16 మంది భోజనం చేశారు. అనంతవరం జడ్పీహెచ్‌స్‌లో 10వ తరగతిలో 68 మందికి 64, 9వ తరగతిలో 55 మందికి 21 మంది హాజరయ్యారు. దోనేపూడి జడ్పీహెచ్‌ఎస్‌లో 10వ తరగతిలో 73 మందికి 20, 45 మందికి 15 మంది హాజరు కాగా మధ్యాహ్న భోజనం ఎవరూ చేయలేదు.


 కొల్లిపర మండలంలోని ఆరు పాఠశాలలో పదో తరగతి విద్యార్థులు 316 మందికి 146 మంది హాజరయ్యారు. అత్తోట హైస్కూల్‌లో అత్యధికంగా 59 మంది విద్యార్థులు హాజరుకాగా అన్నవరంలంకలో అతితక్కువగా 5 శాతం మాత్రమే హాజరయ్యారు. 9వతరగతి విద్యార్థులు 313 మందికి 116 మంది మాత్రమే హాజరయ్యారు. కొన్ని పాఠశాలల్లో బ్లాక్‌ బోర్డులు సిద్ధంగా లేవు.


భట్టిప్రోలు మండలంలోని 5 ప్రభుత్వ, 3 ఎయిడెడ్‌ ఉన్నత పాఠశాలల్లోని 9, 10 తరగతి విద్యార్థులు 60 శాతం మంది విద్యార్థులు తరగతులకు హాజరైనట్లు ఎంఈవో వెంకటేశ్వరరావు తెలిపారు. 


 వేమూరు మండలం జంపని, వేమూరు, చావలి, పెరవలి, వరహాపురం, కుచ్చెళ్ళపాడు హైస్కూల్స్‌ పరిధిలో 9, 10 తరగతులకు 584 మందికి 162 మంది మాత్రమే హాజరైనట్లు ఎంఈవో కాజా లక్ష్మీనారాయణ తెలిపారు. 


వినుకొండ మండలంలో 9వ తరగతిలో 750 మందికి 200మంది, 10వ తరగతిలో 700 మందికి 240 మంది విద్యార్థులు హాజరైనట్లు ఎంఈవో జఫ్రుల్లా తెలిపారు. కొవిడ్‌ నిబంధనల అమలకు పాఠశాలకు ఒక్కో అధికారిని నియమించినప్పటికీ అవేమి ఇక్కడ అమలు కాలేదు. ఈపూరు, నూజెండ్ల మండలాల్లో కేవలం 25 శాతం మంది మాత్రమే విద్యార్థులు హాజరయ్యారు. 


 తాడికొండ మండలంలోని ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలలో 9, 10 తరగతుల్లో సుమారు 2000 మంది విద్యార్థులకు 210 మంది మాత్రమే హజరయ్యారు.  


 రేపల్లె, నిజాంపట్నం, నగరం, చెరుకుపల్లి మండలాలోని పాఠశాలల్లో 10 మంది వరకు విద్యార్థులే హాజరయ్యారు. విద్యార్థులకు టెంపరేచర్‌ టెస్టులు ఉపాధ్యాయులు నిర్వహించి తరగతి గదుల్లోకి అనుమతి ఇచ్చారు. రేపల్లె పట్టణంలోని షిర్డీ సాయి ఉన్నతపాఠశాలలో 9వ తరగతిలో ఒక్క విద్యార్థిని హాజరైంది.  


 చిలకలూరిపేట నియోజకవర్గంలో తొలిరోజు విద్యార్థుల హాజరు 50శాతం లోపే ఉంది. సందెపూడి జడ్పీ హైస్కూలులో 80 శాతం, ఉన్న వలో 50శాతం విద్యార్థులు హాజరయ్యా రు. యడ్లపాడు, వంకాయలపాడు, కారుచోల, తిమ్మాపురం సూళ్లలో 30 శాతం కన్నా తక్కువగా హాజరు నమోదైంది. 


 తుళ్లూరు మండలంలోని పాఠశాలల్లో 25 శాతం మాత్రమే మొదటి రోజు విద్యార్థులు క్లాసులకు హాజరయ్యారు. తుళ్లూరులో ఎయిడెడ్‌ కళాశాలలో సీనియర్‌ ఇంటర్‌మీడియట్‌ ఎంపీసీ గ్రూపు విద్యార్థులకు  బోధన చేయడంతో భౌతిక దూరం కష్టంగా మారింది.


- తాడేపల్లి మండలం పెనుమాక జడ్పీ హైస్కూల్‌లో 9వ తరగతికి 180 మందికి 30 మంది, 10వ తరగతిలో 190 మందికి 70 మంది హాజరయ్యారు. చిర్రావూరులో 9వ తరగతికి 31 మందికి ఒక్కరు కూడా హాజరు కాలేదు. తాడేపల్లిలోని కేవీఆర్‌ జడ్పీ హైస్కూల్‌లో 9వ తరగతిలో 195 మందికి 32 మంది, 10వ తరగతికి 166 మందికి 71 మంది హాజరయ్యారని హెచ్‌ఎం రాయల సుబ్బారావు తెలిపారు. వడ్డేశ్వరం జడ్పీ హైస్కూల్‌లో ఇద్దరు విద్యార్థులకు, ఓ ఉపాఽధ్యాయుడికి కొవిడ్‌ సోకడంతో వారిని పాఠశాలలోకి అనుమతించలేదు. 


 మంగళగిరిలోని సీకే బాయ్స్‌ హైస్కూల్‌, సీకే గర్ల్స్‌ హైస్కూల్‌లో 50 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. దుగ్గిరాల మండలంలోని ఎనిమిది పాఠశాలలో పదో తరగతి విద్యార్థులు 588 మందికి 288 మంది హాజరయ్యారు. చిలువూరు కేవీఎస్‌ హైస్కూల్‌లో అత్యధికంగా హాజరు కాగా దుగ్గిరాల బాలురు హైస్కూల్‌లో 15శాతం,  బాలికల హైస్కూల్‌లో 18శాతం హాజరయ్యారు.  


 పిడుగురాళ్ల మండలంలో 9 జడ్పీ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరు 50 శాతానికి మించలేదు. ఎంఈవో మల్లికార్జునశర్మ మధ్యాహ్న భోజన సమయంలో ఏర్పాట్లను పరిశీలించారు. మాచవరం మండలంలోని 4 జడ్పీ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు 60 శాతానికి మించలేదు. 


 ప్రత్తిపాడు పరిధిలోని పలు పాఠశాలల్లో కొవిడ్‌ నిబంధనలు పాటిం చలేదు. గదుల్లో భౌతిక దూరం మరిచి విద్యార్థులు ఎప్పటి లాగే పక్కపక్కనే కూర్చున్నారు. ధర్మల్‌ గన్లు, శానిటైజర్లు చాలా పాఠశాలల్లో కనిపించలేదు.  


 పెదనందిపాడు మండలంలో 8 జడ్పీ, 1 ఎయిడెడ్‌ పాఠశాలల్లో 10వ తరగగతి విద్యార్థులు 184 మందికి 133 మంది, 9వ తరగతిలో 101 మం దికి 84 మంది మాత్రమే హాజరయ్యారు.  ప్రభుత్వం ఇచ్చిన మాస్క్‌లు పక్కన పడేసి విద్యార్థులు ఇంటి నుంచి తెచ్చుకున్న వాటిని ధరించారు.   

Updated Date - 2020-11-03T10:58:15+05:30 IST