పిల్లల ప్రాణాలతో చెలగాటమాడటమే

ABN , First Publish Date - 2020-10-31T07:53:21+05:30 IST

కరోనా వ్యాప్తి రోజుకొక రీతిలో తగ్గుతూ పెరుగుతూ ఉంటే ప్రభుత్వం నవంబరు 2నుంచి విద్యాసంస్థలను తెరవాలనుకోవటం పిల్లలప్రాణాలతో చెలగాటమాడటమేనని మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు

పిల్లల ప్రాణాలతో చెలగాటమాడటమే

 విద్యాసంస్థల ప్రారంభంపై కొమ్మాలపాటి


దకూరపాడు, అక్టోబరు 30: కరోనా వ్యాప్తి రోజుకొక రీతిలో తగ్గుతూ పెరుగుతూ ఉంటే ప్రభుత్వం నవంబరు 2నుంచి విద్యాసంస్థలను తెరవాలనుకోవటం పిల్లలప్రాణాలతో చెలగాటమాడటమేనని మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వలన విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, పిల్లలను స్కూళ్ళు, కళాశాలలకు పంపితే ఏ నిమిషానికి ఏమి జరుగుతుందోనని భయాందోళనలకు గురవుతున్నారని ఆయన పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు అడ్డు వచ్చిన కరోనా విద్యాసంస్థలకు వర్తించదా? అని ఆయన ప్రశ్నించారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులను అరెస్టు చేయటంపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయని, తక్షణమే వారిని విడుదల చేయాలని కొమ్మాలపాటి డిమాండ్‌ చేశారు. 

Read more