డ్రైవర్లు డిజిటల్‌ కాపీలను చూపినా చాలు

ABN , First Publish Date - 2020-10-04T06:35:26+05:30 IST

వాహన డ్రైవర్ల లైసెన్స్‌, రిజిస్ట్రేషన్‌ తదితర సిర్టిఫికెట్లను డిజిటలైజేషన్‌ చేస్తున్నట్లు, డ్రైవర్లు ఎలకా్ట్రనిక్‌ కాపీలను సమర్పించవచ్చని కేంద్ర రోడ్లు, రవాణా శాఖ తెలియజేసింది.

డ్రైవర్లు డిజిటల్‌ కాపీలను చూపినా చాలు

 గతంలో కేంద్ర మంత్రికి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు లేఖ

 బదులు లేఖ రాసిన కేంద్ర మంత్రి


గుంటూరు, అక్టోబరు 3: వాహన డ్రైవర్ల లైసెన్స్‌, రిజిస్ట్రేషన్‌ తదితర సిర్టిఫికెట్లను డిజిటలైజేషన్‌ చేస్తున్నట్లు,  డ్రైవర్లు ఎలకా్ట్రనిక్‌ కాపీలను సమర్పించవచ్చని కేంద్ర రోడ్లు, రవాణా శాఖ తెలియజేసింది. సవరించిన మోటార్‌ వాహనాలు (సవరణ) చట్టం -2020 ప్రకారం నోటిఫై చేసిన భారీ జరిమానాలు, విద్యార్ధులు, తల్లిదండ్రులకు కలుగుతున్న అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని వాహన పత్రాలను డిజిటలైజ్‌ చేయాలని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గతేడాది మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. ప్రస్తుతం కేంద్ర మంత్రిత్వ శాఖ ఈ విషయంపై దృష్టి సారించి.. పత్రాలు డిజిటలైజ్‌ చేసినట్లు శ్రీకృష్ణదేవరాయలుకు బదులు లేఖ ద్వారా తెలియజేశారు. దీనిపై ఎంపీ కేంద్రమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. 

Updated Date - 2020-10-04T06:35:26+05:30 IST