ఐక్యత దెబ్బతీసేందుకు ఐదు కార్పొరేషన్లు
ABN , First Publish Date - 2020-10-04T06:32:42+05:30 IST
కల్లుగీత కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్‌ను ఐదుముక్కలుగా చేసి ఐదు కార్పొరేషన్‌లుగా విభజించటం సరికాదని రాష్ట్ర కల్లుగీత ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తాతా జయప్రకాష్ నారాయణ అన్నారు.
కల్లుగీత ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తాతా జయప్రకాష్ నారాయణ
బాపట్ల, అక్టోబరు 3: కల్లుగీత కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్‌ను ఐదుముక్కలుగా చేసి ఐదు కార్పొరేషన్‌లుగా విభజించటం సరికాదని రాష్ట్ర కల్లుగీత ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తాతా జయప్రకాష్ నారాయణ అన్నారు. బాపట్ల పట్టణంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గౌడ, చెట్టిబలిజ, శ్రీసైన, యాత, ఈడిగ అంటూ ఐదు కార్పొరేషన్‌లు ప్రకటించి బీసీల ఐక్యతను దెబ్బతీస్తున్నారన్నారు.
తెలుగుదేశం హయాంలో 2017-2018 సంవత్సరానికి రూ.35కోట్లు, 18-19 సంవత్సరానికి రూ.70కోట్లు నిధులు కేటాయించి కల్లుగీత కార్మికులకు 50శాతం సబ్సిడీ రుణాలు అందించినట్లు పేర్కొన్నారు. సమావేశంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు వడ్లమూడి వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు కూచిపూడి శ్యామ్‌సుందర్ పాల్గొన్నారు.