కరోనా.. 491
ABN , First Publish Date - 2020-10-04T06:24:29+05:30 IST
జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. శనివారం ఉదయం వరకు వివిధ ల్యాబ్‌ల నుంచి అందిన ఫలితాల్లో కొత్తగా 491 మంది కొవిడ్-19 బారిన పడ్డారు.
మరో నలుగురి మృతి
గుంటూరు, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. శనివారం ఉదయం వరకు వివిధ ల్యాబ్‌ల నుంచి అందిన ఫలితాల్లో కొత్తగా 491 మంది కొవిడ్-19 బారిన పడ్డారు. దీంతో జిల్లాలో ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 57,845కి చేరుకొంది. శనివారం మరో నలుగురు మరణించడంతో ఇప్పటివరకు మృతుల సంఖ్య 603కి పెరిగింది.
తాజాగా గుంటూరు నగరంలో 81, తాడేపల్లి - 43, పెదనందిపాడు - 33, సత్తెనపల్లి - 13, మంగళగిరి - 10, మేడికొండూరు - 10, ముప్పాళ్ల - 10, తాడికొండ - 10, చిలకలూరిపేట - 46, యడ్లపాడు - 18, నాదెండ్ల - 27, నరసరావుపేట - 20, రొంపిచర్ల - 20, భట్టిప్రోలు - 10, పొన్నూరు - 22, రేపల్లెలో 38 మందికి కరోనా నిర్ధారణ అయింది. మిగిలిన మండలాల్లో మరో 90 మందికి వైరస్ సోకినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జె. యాస్మిన్ ఓ ప్రకటనలో తెలిపారు.