జై అమరావతి అనేందుకు ఎమ్మెల్యే నిరాకరణ
ABN , First Publish Date - 2020-10-03T11:21:51+05:30 IST
భూములు ఇచ్చి రోడ్డున పడ్డామని రాజధాని మహిళా జేఏసీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఉద్దండ్రాయునిపాలెంలో తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి శుక్రవారం వినతిపత్రం అందించారు.

తుళ్లూరు, అక్టోబరు 2: భూములు ఇచ్చి రోడ్డున పడ్డామని రాజధాని మహిళా జేఏసీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఉద్దండ్రాయునిపాలెంలో తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి శుక్రవారం వినతిపత్రం అందించారు. అసైన్డ్ రైతులకు, పట్టా భూ మితో సమాన ప్యాకేజీ ఇస్తామన్న హామీ నెరవేరలేదని వినతిపత్రంలో పేర్కొన్నారు. అమ రావతిలో భూమిలేని నిరుపేదలకు ప్రతి నెలా గత ప్రభుత్వం ఇస్తున్న రూ.2500ను వైసీపీ అధికారం వచ్చిన వెంటనే ఐదు వేలు ఇస్తామని హామీ ఇచ్చారని, దానిని అమలు చేయలేదని తెలిపారు.
ఎమ్మెల్యేను కలిసేందుకు దాదాపు రెండు గంటలు వేచి ఉన్నారు. చివరికి ఎమ్మెల్యే శ్రీదేవిని కలిసి వినతిపత్రం ఇచ్చి జై అమరావతి అనాలని కోరారు. అందుకు నిరాకరించిన ఎమ్మెల్యే కారు ఎక్కి వెళ్ళిపోయారు. రాజధాని రైతులు, మహిళలు జై అమరావతి అని నినాదాలు చేయగా, అక్కడే ఉన్న వైసీపీ కార్యకర్తలు జై జగన్ అంటూ నినాదాలు చేశారు. ఎక్కడో బయట నుంచి వచ్చి జై జగన్ అని అంటారా..? అని మహిళా జేఏసీ సభ్యులు మండిపడ్డారు. కాగా వినతిపత్రంలోని సమస్యను అధిష్టానం దృష్టికి తీసుకెళతామని ఎమ్మెల్యే .. జేఏసీ సభ్యులకు చెప్పారు.