చంద్రబాబు దూరదృష్టితోనే ఎత్తిపోతల నిర్మాణం - మాజీ మంత్రి దేవినేని ఉమ

ABN , First Publish Date - 2020-09-29T10:39:04+05:30 IST

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టితోనే కొండవీటి వాగు ఎత్తిపోతల పథక నిర్మాణం సాధ్యమైందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.

చంద్రబాబు దూరదృష్టితోనే ఎత్తిపోతల నిర్మాణం  - మాజీ మంత్రి దేవినేని ఉమ

తాడేపల్లి, సెప్టెంబరు 28: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టితోనే కొండవీటి వాగు ఎత్తిపోతల పథక నిర్మాణం సాధ్యమైందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. కొండవీటి ఎత్తిపోతలను ఆయన సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిర్మాణ సమయంలో భూసేకరణ విషయంలో అప్పటి ప్రతిపక్ష నేతలు ఎత్తిపోతల వల్ల ఉపయోగం లేదని, కోట్లు వృధా చేస్తున్నారని అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నించారని తెలిపారు.


కొండవీటి వాగు ఎత్తిపోతలను సందర్శించడానికి వస్తే, మోటార్లు కట్టివేశారని, కారణం అడిగితే సరైన సమాధానం చెప్పలేదని స్థానిక అధికారులపై మాజీమంత్రి ఉమా అసహనం వ్యక్తం చేశారు. మంగళగిరి నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జి గంజి చిరంజీవి, తాడేపల్లి మండల టీడీపీ అధ్యక్షుడు కొమ్మారెడ్డి కిరణ్‌ మాజీ మంత్రి వెంట ఉన్నారు. కాగా కొండవీటి వాగులో వరదనీటి ఉధృతి పెరగడంతో రైతుల అభ్యర్థన మేరకు అధికారులు ఎత్తిపోతల పథకం ద్వారా వరదనీటిని సోమవారం కృష్ణానదిలోకి విడుదల చేశారు. 6 మోటర్ల ద్వారా సుమారు 5 వేల క్యూసెక్కుల నీటిని నదిలోకి వదిలారు.  

Updated Date - 2020-09-29T10:39:04+05:30 IST