శాసన రాజధానితో అమరావతి నిర్వీర్యం

ABN , First Publish Date - 2020-09-29T10:30:27+05:30 IST

అమరావతి నుంచి ఐదేళ్లుగా పాలన జరుగుతుంటే, ప్రస్తుత పాలకులు శాసన రాజధాని అని నిర్వీర్యం చేస్తున్నారని రైతులు ధ్వజమెత్తారు. ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగాలని రైతులు, కూలీలు చేస్తోన్న ఉద్యమం సోమవారానికి 286వ రోజుకు చేరుకుంది. వెంకటపాలెం, మందడం, వెలగపూడి, రాయపూడి,

శాసన రాజధానితో అమరావతి నిర్వీర్యం

286వ రోజు ఆందోళనల్లో రైతులు ధ్వజం

తుళ్లూరు, మంగళగిరి క్రైమ్‌, తాడేపల్లి, తాడికొండ, సెప్టెంబరు 28: అమరావతి నుంచి ఐదేళ్లుగా పాలన జరుగుతుంటే, ప్రస్తుత పాలకులు శాసన రాజధాని అని నిర్వీర్యం చేస్తున్నారని రైతులు ధ్వజమెత్తారు. ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగాలని రైతులు, కూలీలు చేస్తోన్న ఉద్యమం సోమవారానికి 286వ రోజుకు చేరుకుంది. వెంకటపాలెం, మందడం, వెలగపూడి, రాయపూడి, దొండపాడు, అనంతవరం, బోరుపాలెం, తుళ్లూరు, పెదపరిమి, ఐనవోలు తదితర రాజధాని గ్రామాలలో నిరసనలు కొనసాగాయి.


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికే అభివృద్ధి చెందిన విశాఖను పాలనా రాజధానిగా చేస్తామని చెప్పడంలో సీఎం జగన్‌ ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. విశాఖలో పాలకులకు చెందిన భూములను అమ్ముకోవడానికి ఇక్కడి రైతుల్ని బలి పశువులి చేస్తున్నారని మండిపడ్డారు. 

 

- అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని కోరుతూ మంగళగిరి మండలం కృష్ణాయపాలెం, యర్రబాలెం, నవులూరు, బేతపూడి, నీరుకొండ, ఆత్మకూరు గ్రామాల్లో   రైతులు చేపట్టిన రిలే దీక్షలు 286వ రోజుకు చేరాయి. ఈ దీక్షల్లో రైతు సంఘ నాయకులు ఉమామహేశ్వరరావు, కిరణ్‌, వీరాంజనేయులు, రాఘవయ్య, ఎం సాంబశివరావు, ఎం రమేష్‌, వెంకటేశ్వరరావు, సతీష్‌, అశోక్‌, కుమారి, ఎం బిందు, పద్మ, జ్యోతి, కుసుమ, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


 తాడేపల్లి మండలం పెనుమాకలో ఐకాస ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షలు 286వ రోజుకు చేరుకున్నాయి. దీక్షలో పలగాని సాంబశివరావు, దండమూడి సదాశివరావు, ముప్పెర మాణిక్యాలరావు, షేక్‌ సాబ్‌జాన్‌, మన్నవ వెంకటేశ్వరరావు, ముప్పెర సుబ్బారావు, మేకా సాంబిరెడ్డి, పలగాని కృష్ణ, ముప్పెర సాంబశివరావు, గోగినేని నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

 

 మూడు రాజధానులకు వ్యతిరేకంగా తాడికొండ మండలం మోతడక గ్రామ రైతులు, మహిళలు సోమవారం నిరసనలు కొనసాగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు అమరావతి కోసం 10 నెలలుగా రోడ్డెక్కి ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం హేళన చేస్తుందన్నారు.  

Updated Date - 2020-09-29T10:30:27+05:30 IST