ఆర్వీఆర్‌జేసీకి ఏఐటీసీఈ నిధులు

ABN , First Publish Date - 2020-09-25T10:51:57+05:30 IST

చౌడవరంలోని ఆర్వీఆర్‌జేసీ ఇంజనీరింగ్‌ కళాశాలకు అఖిలభారతి సాంకేతిక విద్యా మండలి(ఏఐటీసీఈ) పరిశోధన, పరిశోధనాలయాల మౌళిక వసతుల కోసం రూ.90 లక్షలు మంజూరు చేసినట్లు ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఆలపాటి సుధాకర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

ఆర్వీఆర్‌జేసీకి ఏఐటీసీఈ నిధులు

గుంటూరు: చౌడవరంలోని ఆర్వీఆర్‌జేసీ ఇంజనీరింగ్‌ కళాశాలకు అఖిలభారతి సాంకేతిక విద్యా మండలి(ఏఐటీసీఈ) పరిశోధన, పరిశోధనాలయాల మౌళిక వసతుల కోసం రూ.90 లక్షలు మంజూరు చేసినట్లు ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఆలపాటి సుధాకర్‌  ఒక ప్రకటనలో తెలిపారు.


కళాశాల ఈఈఈ విభాగానికి(డాక్టర్‌ కే చంద్రశేఖర్‌) రూ.8.81 లక్షలు, సీఎస్‌ఈ(డాక్టర్‌ ఎం శ్రీలత) విభాగానికి రూ.11.56 లక్షలు, ఈసీఈ (డాక్టర్‌ టీ రంగబాబు) విభాగానికి రూ.9.82 లక్షలు, (డాక్టర్‌ జీ సుధారాణి) రూ.1.63  లక్షలు, మెకానికల్‌ విభాగానికి(డాక్టర్‌ కే ప్రవీణ్‌కుమార్‌) రూ.8 లక్షలు, (డాక్టర్‌ జీ శ్రీనివాసరావు) రూ.5.68 లక్షలు సీఈ విభాగానికి రూ.2.42 లక్షలు(డాక్టర్‌ కేఎస్‌ సాయిరామ్‌) కేటాయించినట్లు తెలిపారు.


ఈ సందర్భంగా కళాశాల అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్‌ రాయపాటి శ్రీనివాస్‌, రాయపాటి గోపాలకృష్ణ, ట్రెజరర్‌ డాక్టర్‌ కొండబోలు కృష్ణప్రసాద్‌ తదితరులు హెచ్‌వోడీలను అభినందించారు.

Updated Date - 2020-09-25T10:51:57+05:30 IST