అడ్డదిడ్డంగా తిరస్కరణ

ABN , First Publish Date - 2020-03-13T11:22:17+05:30 IST

అడ్డదిడ్డంగా తిరస్కరణ

అడ్డదిడ్డంగా తిరస్కరణ

గుంటూరు, మార్చి 12: జిల్లాలో గురువారం జరిగిన నామినేషన్ల స్ర్కూట్నీ ప్రక్రియ వ్యవహారం కూడా అడ్డగోలుగా నిర్వహించారు. అకారణంగా పలువురు అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారు. పెదకూరపాడు నియోజకవర్గం పరిధిలోని కంభంపాడు టీడీపీ అభ్యర్థి నామినేషన్‌ పత్రాలను వైసీపీ నేతలతో కుమ్మక్కై అధికారులు మాయం చేశారని ఆ పార్టీ నాయకులు ఆరోపించారు. అదే నియోజవర్గం పరిధిలోని చందర్లపాడు టీడీపీ అభ్యర్థి పాతలిస్టులో నెంబరు వేశారని అభ్యంతరం తెలిపి చెల్లదని అధికారుల చేత చెప్పించే ప్రయత్నం చేశారన్నారు. పొన్నూరు నియోజకవర్గ పరిధిలోని మన్నవ టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి తనపై ఉన్న పోలీసు కేసు వివరాల్లో సంవత్సరం తప్పుగా వేశాడని నామినేషన్‌ను పెండింగ్‌ లో పెట్టారు. గురజాల నియోజకవర్గంలోని పెదగార్లపాడు టీడీపీ అభ్యర్థి సంతకం సరిపోలేనందున నామినేషన్‌ను తిరస్కరించారు. గురజాల ని యోజకవర్గంలోని గోగులపాడు టీడీపీ అభ్యర్థి షేక్‌ మస్తాన్‌ జన్మధృవీకరణ పత్రంలో వయసు తప్పు గా ఉందని నామినేషన్‌ను తిరస్కరించారు. వినుకొండ నియోజకవర్గంలోని నడిగడ్డ టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి  ఓటర్‌ ఐడీ అసెంబ్లీ ఓటర్లు లిస్టులో ఉండి కొత్తగా వచ్చిన పంచాయతీ ఓటర్ల లిస్టులో లేదనే వంకతో నామినేషన్‌ను తిరస్కరించారు. 

- సత్తెనపల్లి మండలం కంకణాలపల్లి జనసేన ఎంపీటీసీ అభ్యర్థి వేల్పూరి


శ్రీనివాసరావుపై వైసీపీ కార్యకర్తలు బుధవారం రాత్రి దాడి చేశారని జనసేన నాయకులు గురువారం విలేకరులకు తెలిపారు.ఎస్సీకి రిజర్వ్‌ అయిన ఈ స్థానంలో పంచాయతీ పరిధిలోని వెన్నాదేవికి చెందిన శ్రీనివాసరావు బుధవారం పార్టీ తరుపున ఎంపీటీ సీ అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. అయితే రాత్రి సమయంలో కొందరు వైసీపీ కార్యకర్తలు శ్రీనివాసరావును బలవంతంగా ఊరిచివర ఉన్న పొలాల్లోకి తీసుకెళ్ళి దాడిచేశారు. నామినేషన్‌ ఉపసంహరించుకోవాలని బెదిరించగా అతడు ససేమిరా అనటంతో కిడ్నాప్‌ చేశారు. ఈవిషయంపై పోలీసులకు ఫిర్యాదు చేద్దామనుకున్న శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను కూడా బెదిరించారని జనసేన నియోజకవర్గ సమన్వయ కర్త తవిటి భవన్నారాయణ చెప్పారు. ఎన్నికల్లో తమకు పోటీలేకుండా ఉండాలనే వైసీపీ ఇలా అరాచకాలకు పాల్పడుతుందని ఆయన ఆరోపించారు.  

- ఎస్టీ మహిళకు రిజర్వు అయిన చెరుకుపల్లి 1 ఎంపీటీసీ స్థానంలో పాలపర్తి దుర్గ


నామినేషన్‌ దాఖలు చేసింది. గురువారం జరిగిన నామినేషన్‌ పరిశీలనలో ఆర్‌వో అజయ్‌కుమార్‌ ఆమోదించారు. అయితే మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో వైసీపీ నాయకులు దుర్గ స్కూల్‌ స్టడీ సర్టిఫికెట్‌ సృష్టించిందని, ఆమె ఎస్టీ కాదంటూ అభ్యంతరం తెలుపుతూ ఆర్‌ఒపై ఒత్తిడి తేవడంతో ఆయన నామినేషన్‌ను పెండింగ్‌లో ఉంచి ఆర్‌డీవోకు సిఫార్స్‌ చేయడంతో గందరగోళం నెలకొంది. గతంలో ఎస్టీ స్థానంలో పోటీ చేస్తే ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదని, ఓటమి భయంతో తన నామినేషన్‌ ఆమెదించకుండా వైసీపీ నాయకులు చేస్తున్నారని దుర్గ ఆవేదన వ్యక్తం చేసింది. ఆరుంబాక ఎంపీటీసీ సెగ్మెంట్‌ నుంచి టీడీపీ తరపున నామినేషన్‌ వేసిన మత్తి శ్రీనివాసరావు తనపై ఉన్న కేసుల వివరాలు చూపలేదని తిరస్కరించారు. 2007లోని కేసును ఐదేళ్ల క్రితం కొట్టివేశారని అయినా తనను పోటీకి అర్హులు చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. వైసీపీ నాయకుల ఒత్తిడికి తలొగ్గి నామినేషన్‌ పత్రాన్ని పెండింగ్‌లో పెట్టిఆ ఆర్డీవోకు సిఫార్సు చేశశారరన్నారు.  


పెదకూరపాడు మండలం కంభంపాడు టీడీపీ ఎంపీటీసీగా నామినేషన్‌ దాఖలు చేసిన తన నామినేషన్‌ను ఎన్నికల అధికారి కావాలనే తొలగించారని అర్తిమళ్ల పద్మావతి తెలిపారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో గురువారం ఆమె విలేకర్లతో మాట్లాడుతూ   నామినేషన్‌పత్రంలో సంతకం పెట్టలేదని, రెండో పేజీలేదని ఎన్నికల అధికారి తిరస్కరించారన్నారు. నామినేషన్‌పత్రంలోని అన్ని కాలాలను పూర్తిచేయించి, అధికారులకు ఇచ్చినప్పటికీ కావాలనే రెండు టీడీపీ నామినేషన్లను మార్చారని ఆరోపించారు. తన నామినేషన్‌ పత్రానికి సంబంధించి 2వ పేజీ లేదనే విషయాన్ని రాసి ఇవ్వాలని కోరినప్పటికీ ఎన్నికల అధికారి రామారావు ఇవ్వలేదన్నారు. ఈ విషయమై ఆర్డీవో వద్దకు అప్పీల్‌కు వెళ్తామన్నారు. నామినేషన్‌ పత్రాల్లో అభ్యర్థుల సంతకాలు లేనందునే స్ర్కూట్నిలో వాటిని తొలగించామని ఆర్‌వో తెలిపారు. 

Updated Date - 2020-03-13T11:22:17+05:30 IST