అనుమానాస్పద మృతిపై కేసు నమోదు

ABN , First Publish Date - 2020-03-13T11:12:12+05:30 IST

అనుమానాస్పద మృతిపై కేసు నమోదు

అనుమానాస్పద మృతిపై కేసు నమోదు

కొల్లూరు, మార్చి 12 : ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందడంపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ఉజ్వల్‌కుమార్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని దోనేపూడి శివారు ఆలపాటినగర్‌కు చెందిన ఆలూరి లాజరు (45) గురువారం ఉదయం తన ఇంటిలో మృతి చెందాడు. మృతుని భార్య మంచం మీద భర్త మృతి చెందడాన్ని గమనించి విషయాన్ని కుటుంబ సభ్యులకు, బంధువులకు తెలిపింది. విషయం తెలుసుకున్న తల్లి ఆనందం కుమారుడు మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఎస్‌ఐ ఉజ్వల్‌కుమార్‌ ఆమె ఫిర్యాదును అందుకుని సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టమ్‌ నిమిత్తం తెనాలి వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 

Updated Date - 2020-03-13T11:12:12+05:30 IST