స్టూవర్టుపురంలో 40 లీటర్ల సారా పట్టివేత

ABN , First Publish Date - 2020-03-13T11:11:53+05:30 IST

స్టూవర్టుపురంలో 40 లీటర్ల సారా పట్టివేత

స్టూవర్టుపురంలో 40 లీటర్ల సారా పట్టివేత

కర్లపాలెం, మార్చి 12: బాపట్లమండలంలోని స్టూవర్టుపురంలో గురువారం ఉదయం జరిపిన దాడులలో 200లీటర్లు బెల్లంఊట, 40లీటర్లు నాటుసారాను పట్టు కున్నామని బాపట్ల ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ సీఐ వెంకటరమణ తెలిపారు. పట్టుకున్న బెల్లంఊట, నాటుసారాను సీజ్‌ చేసి వారిపై కేసునమోదు చేశామన్నారు. ఈ క్రమంలో మండల కేంద్రం కర్లపాలేనికి చెందిన మందపాటి మోషె వద్ద నుంచి 6 మద్యం సీసాలు, నల్లమోతువారిపాలేనికి చెందిన బి.రాజశేఖర్‌ వద్ద  9 మద్యం సీసాలను స్వాధీనం చేసుకొని కోర్టులో హాజరు పరచగా మేజిస్ర్టేట్‌ రిమాండ్‌ విధించారన్నారు. బాపట్ల ప్రభాకరరావును అనుమానంతో స్టేషన్‌కు తరలించి తదుపరి విచారణ అనంతరం సొంత పూచీకత్తుపై వదిలేశామని సీఐ వెంకటరమణ తెలిపారు. అతనిని మండల ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ర్టేట్‌ వద్ద హాజరు పరుస్తామన్నారు. 

Updated Date - 2020-03-13T11:11:53+05:30 IST