-
-
Home » Andhra Pradesh » Guntur » gnt
-
చికిత్స పొందుతున్న ఇద్దరి మృతి
ABN , First Publish Date - 2020-03-13T11:11:33+05:30 IST
చికిత్స పొందుతున్న ఇద్దరి మృతి

తాడేపల్లి టౌన్, మార్చి 12: ప్రమాదాల్లో గాయపడి చికిత్స పొందుతున్న ఇద్దరు గురువారం మృతిచెందినట్లు తాడేపల్లి పోలీసులకు సమాచారం అందింది. గత నెల 2న సీతానగరానికి చెందిన ఐశ్యర్య (6)చలిమంట వేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు గాయపడింది. బాలిక విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందు తూ మృతిచెందింది. ఈ నెల 9న పట్టణానికి చెందిన రంగామోహన్ (60), సీతానగరం వద్ద రోడ్డు దాటుతుండగా బైక్ ఢీకొనడంతో తలకు గాయమై విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటనలపై పోలీసులు కేసులు నమోదుచేశారు.