-
-
Home » Andhra Pradesh » Guntur » gnt
-
గేదెలు, వ్యవసాయ మోటార్ల దొంగల అరెస్టు
ABN , First Publish Date - 2020-03-13T11:11:15+05:30 IST
గేదెలు, వ్యవసాయ మోటార్ల దొంగల అరెస్టు

రాజుపాలెం, మార్చి 12: మండలం లోని పలు గ్రామాల్లో గేదెలు, వ్యవ సాయ మోటార్లు దొంగతనానికి గురి కావటంతో రాజుపాలెం పోలీసులు ప్రత్యేక దృష్టిసారించారు. దీంతో ఈనెల 12న మండల కేంద్రం మాచవరం గ్రామానికి చెందిన బత్తుల బ్రహ్మయ్య, వేమవరానికి చెందిన షేక్ అహ్మద్ అనేవారు గేదెలు, వ్యవసాయ మోటార్లు దొంగతనానికి పాల్పడటంతో రాజుపా లెం మండలం కొండమోడు వద్ద పట్టు బడ్డారు. వారి నుంచి 2 గేదెలు, రెండు వ్యవసాయ డీజిల్ మోటార్లను స్వాధీ నం చేసుకున్నట్లు ఎస్‌ఐ వెంకటప్రసాద్ తెలిపారు. వారిని విచారించగా రాజు పాలెం గ్రామ పరిధిలోని రెండుచోట్ల గేదెలను దొంగతనం చేసినట్లు, పిడుగు రాళ్ల మండల పరిధిలో వ్యవసాయ డీజిల్ మోటార్లను దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నట్లు తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరచ నున్నట్లు ఎస్ చెప్పారు.