ఆనవాళ్ల ఆధారంగా దర్యాప్తు

ABN , First Publish Date - 2020-03-13T11:10:27+05:30 IST

ఆనవాళ్ల ఆధారంగా దర్యాప్తు

ఆనవాళ్ల ఆధారంగా దర్యాప్తు

యువతి మృతదేహాన్ని పరిశీలించిన  డీఎస్పీ వీరారెడ్డి

గొలుసు, తాళాలు లభ్యం

జీజీహెచ్‌కు మృతదేహం తరలింపు


యడ్లపాడు, మార్చి 12: పొదల మధ్య కాలి పడివున్న యువతి మృతదేహాన్ని నరసరావుపేట డీఎస్పీ వీరారెడ్డి గురువారం పరిశీలించారు. యడ్లపాడు మండలం గుత్తావారిపాలెం-జాలాది మార్గంలో రోడ్డుపక్కనే ఉన్న పొదలలో గుర్తుతెలియని మహిళ మృతదేహాం బుధవారం సాయంత్రం బయల్పడిన విషయం విదితమే. ఘటనాస్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ  ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మృతికి సంబంధించి అన్ని కోణాలలో దర్యాప్తు చేయాల్సివుందన్నారు. సంఘటన ఎప్పుడు జరిగింది.. ఎవరైనా చంపి ఇక్కడకు తెచ్చి దహనం చేశారా.. ఇక్కడే చేయడానికి కారణాలు ఏమిటి అన్న విషయాలు తెలియాల్సి వుందన్నారు. మృతదేహం పూర్తిగా కాలిపోయినప్పటికి ఆమె ధరించిన గులాబి రంగు లెగ్గింగ్‌ క్లాత్‌ కాలి చివరన కొద్దిగా ఉందని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా ఘటనా స్థలానికి సమీపంలో గొలుసు, తాళాలు లభ్యమయ్యాయన్నారు. లభ్యమైన ఆనవాళ్ళ ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తామన్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. డీఎస్పీ వీరారెడ్డి వెంట చిలకలూరిపేట రూరల్‌ సీఐ సుబ్బారావు, యడ్లపాడు ఎస్‌ఐ నాగేశ్వరరావు, సిబ్బంది ఉన్నారు. 

Updated Date - 2020-03-13T11:10:27+05:30 IST