5న ఏపీటీఎఫ్‌ ఆధ్వర్యంలో విజయవాడలో మహాధర్నా

ABN , First Publish Date - 2020-03-04T09:34:54+05:30 IST

5న ఏపీటీఎఫ్‌ ఆధ్వర్యంలో విజయవాడలో మహాధర్నా

5న ఏపీటీఎఫ్‌ ఆధ్వర్యంలో విజయవాడలో మహాధర్నా

గుంటూరు(విద్య), మార్చి 3: ఈ నెల 5న విజయవాడలో ఏపీటీఎఫ్‌ ఆధ్వర్యంలో జరిగే మహాధర్నాను విజయవంతం చేయాలని రాష్ట్ర అధ్యక్షులు పాండురంగవరప్రసాద్‌ విజ్ఞప్తి చే శారు. జిల్లా కోర్టు రోడ్డులోని ఏపీటీఎఫ్‌ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీపీఎస్‌ రద్దు, పీఆర్‌సీ అమలు, డీఏ బకాయులు తదితర 45 డిమాండ్స్‌తో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నట్లు తెలిపారు. రెం డు సంవత్సరాల క్రితం అమలు చేయాల్సిన పీఆర్‌సీని ఇంకా తేల్చకుండా జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. డీఏ బకాయి లు నాలుగు ఉన్నాయని ఆయా సమస్యలపై మహాధర్నా చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె బసవలింగారావు, సయ్యద్‌చాంద్‌బాషా మాట్లాడుతూ ప్రభుత్వ ఆధీనంలోనే కామన్‌స్కూల్‌ విధానం ఉండాలని, ప్రభుత్వ స్కూల్స్‌ మాత్రమే అమ్మఒడి వర్తింపచేయాని కోరారు. 

Updated Date - 2020-03-04T09:34:54+05:30 IST