ప్రమాదవశాత్తు కార్మికుడి మృతి

ABN , First Publish Date - 2020-03-04T09:32:43+05:30 IST

ప్రమాదవశాత్తు కార్మికుడి మృతి

ప్రమాదవశాత్తు కార్మికుడి మృతి

దాచేపల్లి, మార్చి3: ప్రమాదవశాత్తు జరిగిన ఘటనలో సిమెంట్‌ ఫ్యాక్టరీ కార్మికుడు మృతి చెందాడు. మంగళవారం పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మాచవరం మండలం తేలుకుట్ల గ్రామానికి చెందిన జంగం రవీంద్రబాబు (25) దాచేపల్లి మండలం తంగెడ భవ్య సిమెంట్‌ కర్మాగారంలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఫ్యాక్టరీలో విధులు నిర్వ హిస్తున్న కార్మికుడు ప్రమాదవశాత్తు గాయ పడటంతో ఫ్యాక్టరీ యాజమాన్యం ప్రథమ చికిత్స నిర్వహించి గురజాల ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో రవీంద్రబాబు మృతిచెందాడు. రవీంద్రబాబుకు భార్య అశ్వని, రెండేళ్ల పాప ఉన్నారు. జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-03-04T09:32:43+05:30 IST