మొక్కవోని ధైర్యంతో రోగులకు సేవలు

ABN , First Publish Date - 2020-12-29T05:30:00+05:30 IST

ఒకవైపు వైద్యులు, సిబ్బందికి కరోనా పాజిటివ్‌ వచ్చినా మొక్కవోని ధైర్యంలో రోగులకు సేవలు అందించారని జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నీలం ప్రభావతి అన్నారు.

మొక్కవోని ధైర్యంతో రోగులకు సేవలు

 జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రభావతి 


 గుంటూరు (మెడికల్‌, సంగడిగుంట), డిసెంబర్‌ 29: ఒకవైపు వైద్యులు, సిబ్బందికి కరోనా పాజిటివ్‌ వచ్చినా మొక్కవోని ధైర్యంలో రోగులకు సేవలు అందించారని జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నీలం ప్రభావతి అన్నారు. మంగళవారం నాట్కో కేన్సర్‌ సెంటర్‌ సెమినార్‌ హాల్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు  ఏడాది ముగుస్తున్న సందర ్భంగా జీజీహెచ్‌ అందించిన సేవలపై ఆమె మాట్లాడారు. గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రిలో మొత్తం 11,421 మంది కొవిడ్‌ బాధితులకు చేరారని, సిబ్బంది అందించిన సేవలతో 9,751 మంది డిశ్చార్జ్‌ అయినట్లు తెలిపారు. 1,033 మంది గర్భిణులకు కొవిడ్‌ సోకినా వారికి విజయవంగా చికిత్సలు చేసినట్లు చెప్పారు. ఈ ఏడాది జీజీహెచ్‌ సాధించిన విజయాలు, రోగులకు పెంచిన సౌకర్యాలు, అరుదైన శస్త్రచికిత్సలు, కొత్త వైద్యచికిత్సలను సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రభావతి తెలిపారు. కార్యక్రమంలో సివిల్‌ సర్జన్‌ ఆర్‌ఎంవో డాక్టర్‌ సతీష్‌కుమార్‌, ఏడీ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-29T05:30:00+05:30 IST