జీజీహెచ్‌కు రూ.25 లక్షల కేన్సర్‌ మందుల విరాళం

ABN , First Publish Date - 2020-12-06T05:35:41+05:30 IST

గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రిలోని నాట్కో కేన్సర్‌ సెంటర్‌లో చికిత్స పొందుతున్న కేన్సర్‌ రోగులకు అవసరమైన మందులను వైద్యాధికారులకు నాట్కో ఫార్మా అందజేసింది.

జీజీహెచ్‌కు రూ.25 లక్షల కేన్సర్‌ మందుల విరాళం
కలెక్టర్‌ ద్వారా ప్రభావతికి కేన్సర్‌ మందులు అందిస్తున్న సదాశివరావు

గుంటూరు (మెడికల్‌) డిసెంబర్‌ 5: గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రిలోని నాట్కో కేన్సర్‌ సెంటర్‌లో చికిత్స పొందుతున్న కేన్సర్‌ రోగులకు అవసరమైన మందులను వైద్యాధికారులకు నాట్కో ఫార్మా అందజేసింది. శనివారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ చేతుల మీదుగా ఈ మందులను నాట్కో ఫార్మా వైస్‌ ప్రెసిడెంట్‌ నన్నపనేని సదాశివరావు, ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రభావతికి అందజేశారు. కార్యక్రమంలో కేన్సర్‌ వైద్య విభాగాధిపతి డాక్టర్‌ దుర్గాప్రసాద్‌, విశ్రాంత ఈఈ అశోక్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-06T05:35:41+05:30 IST