లిక్విడ్‌గా గంజాయి అమ్మకాలు.. ఆరుగురు అరెస్ట్

ABN , First Publish Date - 2020-07-20T19:09:09+05:30 IST

గుంటూరు : జిల్లాలో మరోమారు గంజాయి అమ్మకాల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.

లిక్విడ్‌గా గంజాయి అమ్మకాలు.. ఆరుగురు అరెస్ట్

గుంటూరు : జిల్లాలో మరోమారు గంజాయి అమ్మకాల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. గంజాయిని లిక్విడ్ రూపంలో అమ్ముతున్న ముఠాను సోమవారం నాడు రెడ్ హ్యాండెడ్‌గా పోలీసులు పట్టుకున్నారు. లిక్విడ్ గంజాయిని శానిటైజర్‌లుగా అమ్ముతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పాతగుంటూరు నందివెలుగు రోడ్డులో నీళ్ళ ట్యాంక్‌ల వద్ద వీటిని తయారు చేస్తున్నారు. ఈస్ట్ డీఎస్పీ సీతారామయ్య ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించి.. ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి నుంచి 8,74 వేల విలువైన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.


కాగా.. కొద్ది రోజుల క్రితమే పాత గుంటూరులో ఇలాంటి ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా గుంటూరుకు చెందిన తిరువీదుల చంద్రశేఖర్, షేక్ ఇబ్రహీం, కోడెల రమేష్ బాబు, విశాఖ జిల్లాకు చెందిన పంగీ జయరాం, జర్రా కొండబాబు, జెమ్మేలీ భాస్కరరావును పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 7 కేజీల గంజాయి, 130 లిక్విడ్ బాటిల్స్, 6 సెల్ ఫోన్‌లు, ఎలక్ట్రానిక్ కాటా, ఫిల్టర్ పేపర్స్ స్వాధీనం చేసుకున్నట్లు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. అమ్మకాలకు సులువుగా ఉంటుందని.. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు గాను దుండుగులు ఇలా లిక్విడ్ రూపంలో మారుస్తున్నారని అమ్మిరెడ్డి మీడియాకు వెల్లడించారు.

Updated Date - 2020-07-20T19:09:09+05:30 IST