10 కిలోల గంజాయి స్వాధీనం: నలుగురి అరెస్టు

ABN , First Publish Date - 2020-11-26T04:13:00+05:30 IST

గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న నలుగురిని చిలకలూరిపేట అర్బన్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.

10 కిలోల గంజాయి స్వాధీనం: నలుగురి అరెస్టు
మాట్లాడుతున్న డీఎస్‌పి విజయభాస్కరరావు, పక్కన నిందితులు

చిలకలూరిపేట, నవంబరు 25 : గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న నలుగురిని చిలకలూరిపేట అర్బన్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. లక్ష విలువచేసే 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నరసరావుపేట డీఎస్పీ విజయభాస్కరరావు వివరాలు తెలుపుతూ.. అరెస్టయిన వారిలో గుంటూరుకు చెందిన లారీడ్రైవర్లు మాదాల నరసింహమూర్తి, ఏల్చూరి అప్పారావు, ధరణికోటకు చెందిన ఉయ్యాల శ్రీనివాసరావు, అనంతపురానికి చెందిన నల్లగొండ వెంకటేశ్వర్లు ఉన్నారన్నారు. వీరంతా గంజాయి అక్రమ రవాణాకు, అమ్మకాలకు పాల్పడుతున్నారని డీఎస్పీ పేర్కొన్నారు. 


Read more