ఉద్యోగం నుంచి నలుగురు కానిస్టేబుల్స్‌ తొలగింపు

ABN , First Publish Date - 2020-03-24T09:54:48+05:30 IST

రూరల్‌ జిల్లా పరిధిలో నిర్లక్ష్యంగా విధులు నిర్వహించిన నలుగురిని ఉద్యోగం నుంచి తొలగిస్తూ రూరల్‌ ఎస్పీ విజ యరావు సోమవారం ఆదేశాలు జారీ...

ఉద్యోగం నుంచి నలుగురు కానిస్టేబుల్స్‌ తొలగింపు

గుంటూరు, మార్చి 23 : రూరల్‌ జిల్లా పరిధిలో నిర్లక్ష్యంగా విధులు నిర్వహించిన నలుగురిని ఉద్యోగం నుంచి తొలగిస్తూ రూరల్‌ ఎస్పీ విజ యరావు సోమవారం ఆదేశాలు జారీ చేశారు. జిల్లా ఏఆర్‌ విభాగంలో హెడ్‌ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న డి.రత్నకుమార్‌ (ఏఆర్‌ హెచ్‌సీ 3005), అచ్చంపేటలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న జి.అక్కిరాజు (పీసీ 4570), రేపల్లె స్టేషన్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్‌ ఎం.కూర్మారావు (పీసీ 4152), యడ్లపాడు స్టేషన్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్‌ ఎస్‌.పోతురాజు (పీసీ 3002)లను విధుల నుంచి తొలగించినట్లు ఎస్పీ తెలిపారు. ఎస్పీ విజయ రావు మాట్లాడుతూ పోలీసు శాఖలో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది క్రమశిక్షణతో మెలగాలన్నారు. విధుల్లో అలసత్వం ప్రదర్శించినా, అవినీతికి పాల్పడినా కఠిన చర్యలు తప్పవన్నారు.  

Read more