మాజీ సర్పంచ్‌ దారుణ హత్య

ABN , First Publish Date - 2020-03-25T09:44:49+05:30 IST

మండలంలోని కొత్తపుల్లారెడ్డిగూడెం మాజీ సర్పంచ్‌ గన్నెబోయిన గంగిరాజు(50) మంగళవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు.

మాజీ సర్పంచ్‌ దారుణ హత్య

వెల్దుర్తి, మార్చి 24: మండలంలోని కొత్తపుల్లారెడ్డిగూడెం మాజీ సర్పంచ్‌ గన్నెబోయిన గంగిరాజు(50) మంగళవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. బజారు నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో ప్రత్యర్థులు దారికాచి మారణాయుధాలతో హత్య చేశారు. గంగిరాజు మొదటి నుంచి కాంగ్రెస్‌ ఆ తరువాత వైసీపీలో కొనసాగుతున్నారు. ఇటీవల టీడీపీ నుంచి వైసీపీలో చేరినవారే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చెన్నకేశవులు తెలిపారు. 

Read more