హోరాహోరీగా జిల్లా ఫుట్‌బాల్‌ చాంపియన్‌ షిప్‌ పోటీలు

ABN , First Publish Date - 2020-12-14T05:25:34+05:30 IST

పేరేచర్ల ఎస్‌జీవీఆర్‌ హైస్కూలు క్రీడా మైదానంలో జిల్లా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి ఫుట్‌బాల్‌ లీగ్‌చాంపియన్‌ షిప్‌పోటీలు హోరాహోరీగా జరుగుతున్నాయి.

హోరాహోరీగా జిల్లా ఫుట్‌బాల్‌ చాంపియన్‌ షిప్‌ పోటీలు
13 ఎండీకే3: జిల్లాస్థాయి ఫుట్‌బాల్‌ లీగ్‌ చాంపియన్‌ షిప్‌ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు

మేడికొండూరు, డిసెంబరు 13: పేరేచర్ల ఎస్‌జీవీఆర్‌ హైస్కూలు క్రీడా మైదానంలో జిల్లా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి ఫుట్‌బాల్‌ లీగ్‌చాంపియన్‌ షిప్‌పోటీలు హోరాహోరీగా జరుగుతున్నాయి. ఆదివారం జరిగిన పోటీల్లో గుంటూరు రూరల్‌ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌, పేరేచర్ల ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ జట్టుపై 6-1 తేడాతో గెలుపొందింది. రెండవ మ్యాచ్‌లో పెదకాకాని మండల ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ జట్టుపై నరసరావుపేట ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ జట్టు 6-0తేడాతో విజయం సాధించింది. మూడవ మ్యాచ్‌లో పేరేచర్ల ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ ఫిరంగిపురం జట్టు గెలుపొందగా, నాలుగో మ్యాచ్‌లో గుంటూరు రూరల్‌ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ జట్టు పెదకాకాని అసోసియేషన్‌ జట్టుపై గెలుపొందింది. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో జిల్లా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కుమ్మర క్రాంతికుమార్‌, అసోసియేషన్‌ తరపున సీహెచ్‌ దుర్గామోహన్‌, జీవీ చంద్రశేఖరరావు, మేడికొండూరు మండల అసోసియేషన్‌ అధ్యక్షుడు మానుకొండ బ్రహ్మాజీ, కె.లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-14T05:25:34+05:30 IST