తెలంగాణ సినీ పెద్దలతో చర్చలు సరికాదు

ABN , First Publish Date - 2020-12-20T04:56:40+05:30 IST

రాష్ట్రంలో సినీ రంగ అభివృద్ధిపై తెలంగాణా సినీ పెద్దలతో చర్చించడం ఏపీలో ఉంటున్న సినీ రంగ కుటుంబాలను అవమానించడమేనని సినీ దర్శకుడు దిలీప్‌రాజా చెప్పారు.

తెలంగాణ సినీ పెద్దలతో చర్చలు సరికాదు

 దర్శకుడు దిలీప్‌రాజా


తెనాలి అర్బన్‌, డిసెంబరు 19: రాష్ట్రంలో సినీ రంగ అభివృద్ధిపై తెలంగాణా సినీ పెద్దలతో చర్చించడం ఏపీలో ఉంటున్న సినీ రంగ కుటుంబాలను అవమానించడమేనని సినీ దర్శకుడు దిలీప్‌రాజా చెప్పారు. పెదరావూరులో శనివారం విలేకరులతో మాట్లాడుతూ, ఇటీవల తెలంగాణ నుంచి విజయవాడ వచ్చిన సినీ పెద్దలతో చలన చిత్ర అభివృద్ధి సంస్థ చర్చలు జరపడం సమంజసం కాదన్నారు. పరిశ్రమ అభివృద్ధిపై రాష్ట్రంలో ఉండే వారితోనే చర్చించాలని కోరారు. 

Read more