వలస కూలీలను ఆదుకోవడంలో విఫలం

ABN , First Publish Date - 2020-05-11T09:41:29+05:30 IST

వలస కూలీలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు

వలస కూలీలను ఆదుకోవడంలో విఫలం

బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ


గుంటూరు(సంగడిగుంట), మే 10: వలస కూలీలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని  బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. అరండల్‌పేటలో ఆదివారం పార్టీకి చెందిన పేద కార్యకర్తలకు నిత్యావసరాలతో కూడిన మోదీ కిట్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వలస కూలీల సమస్యలపై ఇప్పటికే ముఖ్యమంత్రికి పలు లేఖలు రాశామన్నారు. అయినా రహదారుల వెంట లక్షలాది కూలీల నడకలు జరుగుతూనే ఉన్నాయన్నారు. లాక్‌డౌన్‌ సందర్భంగా మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా 5 కోట్ల కిట్లను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.  కార్యక్రమంలో పార్టీ సీనియర్‌ నాయకులు జూపుడి రంగరాజు, చందు సాంబశివరావు, అమ్మిశెట్టి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.  


గుంటూరు(విద్య): రైలుపేటలోని బ్రహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర లీగల్‌ సెల్‌ కన్వీనర్‌ జూపూడి రంగరాజు ఆధ్వర్యంలో నిత్యావసరాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సమితి ఉపాఽధ్యక్షులు జంగాలపల్లి పార్థసారథి, బాపూజీ ఆదర్శ సేవ సమితి సభ్యులు కనకదుర్గయ్య, రవీంధ్రనాథ్‌శర్మ, శ్రీనివాస్‌, ప్రసాద్‌, శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-05-11T09:41:29+05:30 IST