అధ్యాపకుల నియామక పరీక్షలు సజావుగా నిర్వహించాలి : డీఆర్వో

ABN , First Publish Date - 2020-03-12T07:05:30+05:30 IST

ఏపీపీఎస్‌సీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ఈనెల 12 నుంచి 15వ తేదీ వరకు అధ్యాపకుల నియామకం కోసం జరిగే

అధ్యాపకుల నియామక పరీక్షలు సజావుగా నిర్వహించాలి : డీఆర్వో

గుంటూరు(విద్య), మార్చి 11 : ఏపీపీఎస్‌సీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ఈనెల 12 నుంచి 15వ తేదీ వరకు అధ్యాపకుల నియామకం కోసం జరిగే పరీక్షను(మెయిన్స్‌) సజావుగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని డీఆర్వో సత్యనారాయణ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టరేట్‌లో బుధవారం ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.  మొత్తం ఏడు కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.


ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షకు 5,533 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. ఇందుకోసం అవసరమైన పూర్తిస్థాయి భద్రత ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో రెవెన్యూ, పోలీసు, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-12T07:05:30+05:30 IST